వారిని చూస్తుంటే గర్వంగా ఉంది.. జమ్మూ- కశ్మీర్ ఫలితాలపై మోదీ! జమ్మూ-కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. జమ్మూలో బీజేపీ నేతల పనితీరు చూస్తుంటే తనకు గర్వంగా ఉందన్నారు. ‘నేషనల్ కాన్ఫరెన్స్’కు మోదీ అభినందనలు తెలిపారు. అభివృద్ధి, సుపరిపాలనే హర్యానాలో గెలిపించాయని చెప్పారు. By srinivas 08 Oct 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి PM Modi: జమ్మూ- కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. జమ్మూలో బీజేపీ ఓడినప్పటికీ తమ పార్టీ నేతల పనితీరు చూస్తుంటే తనకు గర్వంగా ఉందని చెప్పారు. ఇక ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ‘నేషనల్ కాన్ఫరెన్స్’కు మోదీ అభినందనలు తెలిపారు. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ప్రదర్శన మెచ్చుకోదగినదేనంటూ పొగిడారు. అలాగే హరియాణా ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించడంపై సంతోషం వ్యక్తం చేసి ప్రధాని.. అభివృద్ధి, సుపరిపాలన రాజకీయాలు గెలిచాయని వ్యాఖ్యానించారు. These elections in Jammu and Kashmir have been very special. They were held for the first time after the removal of Articles 370 and 35(A) and witnessed a high turnout, thus showing the people’s belief in democracy. I compliment each and every person of Jammu and Kashmir for… — Narendra Modi (@narendramodi) October 8, 2024 అభివృద్ధి, సుపరిపాలనే గెలిపించాయి.. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. జమ్ము కశ్మీర్‌లో బీజేపీకి ఓటు వేసిన అందరికీ ధన్యవాదాలు. ప్రజల సంక్షేమానికి కృషి చేస్తాం. ఏమాత్రం వెనక్కి తగ్గుకుండా పార్టీ కార్యకర్తలంతా చివరి వరకూ అద్భుతంగా పనిచేశారు. హర్యానాలోనూ బీజేపీ స్పష్టమైన ఆధిక్యం సాధించింది. హర్యానాలో మరోసారి బీజేపీకి పట్టం కట్టిన ప్రజలకు సెల్యూట్. అభివృద్ధి, సుపరిపాలనే బీజేపీని మరోసారి గెలిపించాయని అన్నారు. ప్రజాస్వామ్యం పునరుజ్జీవం.. ప్రధాని నరేంద్ర మోదీ హామీ మేరకు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడంతో జమ్మూకశ్మీర్‌లో ప్రజాస్వామ్యం పునరుజ్జీవం పొందిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఎన్నికలలో పాల్గొన్నందుకు కేంద్ర పాలిత ప్రాంతం (UT) ప్రజలను అభినందించారు. ఉగ్రవాదం ముప్పునుంచి మొదటిసారిగా J&K ప్రజలు ఇంత పారదర్శకంగా, శాంతియుతంగా ఎన్నికల్లో పాల్గొనడంపై సంతోషం వ్యక్తం చేశారు. 1987 అసెంబ్లీ ఎన్నికలను కాంగ్రెస్ బహిరంగంగా రిగ్గింగ్ చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన జమ్మూ కాశ్మీర్ ప్రజలకు బాగా గుర్తుంది. అదే కాశ్మీర్ లోయలో ఇప్పుడు ప్రజాస్వామ్యం పునరుజ్జీవింపబడింది అని అమిత్ షా అన్నారు. #pm-modi #haryana #jammukashmir మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి