/rtv/media/media_files/2025/11/24/maoists-writes-letter-2025-11-24-18-43-31.jpg)
Another blow to Maoists..Maoist top leader killed in encounter
Odisha : మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వరుసగా ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లతో తీవ్రంగా నష్టపోయిన పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. ఒడిశాలోని కందమాల్ జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత గణేష్ ఉయికే సహా ఐదుగురు మృతి చెందారు. వీరి తలపై రూ. కోటికి పైగా రివార్డు ఉండటం గమనార్హం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఒడిశాలోని కందమాల్ జిల్లాలో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యుడు పాకా హనుమంతు అలియాస్ గణేశ్ ఉయికే హతమైనట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు మరో ఐదుగురు మావోయిస్టులు మరణించారు. అందులో మహిళలు కూడా ఉన్నారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పోస్ట్ చేశారు.
ఒరిస్సా రాష్ట్రం కందమాల్ జిల్లా గుమ్మా అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఒరిస్సా ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు గాలింపు కొనసాగిస్తున్న క్రమంలో మావోయిస్టులు ఎదురుపడటంతో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఎన్ కౌంటర్ లో ఆరుగురు మావోయిస్టులు చనిపోగా.. సంఘటనా స్థలంలో మావోయిస్టులకు సంబంధించిన ఆయుధాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఎన్ కౌంటర్ నేపథ్యంలో భద్రతా బలగాలు పరిసర అటవీ ప్రాంతాల్లో మావోయిస్టుల కోసం కూంబింగ్స్ ఆపరేషన్స్ ముమ్మరం చేశారు. మరికొంతమంది మావోయిస్టులు తప్పించుకున్నారనే కోణంలో గాలింపు జరుపుతున్నారు.
#WATCH | Bhubaneswar: Top Maoist leader Ganesh Uike, carrying Rs1.1 crore bounty, killed in encounter
— ANI (@ANI) December 25, 2025
Odisha DGP Yogesh Bahadur Khurania says, "A major anti-Naxal joint operation is underway on the border of Ganjam district. This morning, the Odisha Police and security forces… pic.twitter.com/nF8uNwLktb
మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ
కాగా, వరుస ఎన్‌కౌంటర్లతో పలువురు కేంద్ర స్థాయి నాయకులను కోల్పొ్యిన మావోయిస్టులకు ఇది మరో షాక్ అని చెప్పవచ్చు. ఎన్ కౌంటర్ మృతుల్లో మావోయిస్టు కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యుడు పాకా హనుమంతు అలియాస్ గణేశ్ ఉయికే ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆయనపై రూ.1.10 కోట్ల రివార్డు కూడా ఉన్నట్లు తెలిపారు. హనుమంతు స్వస్థలం తెలంగాణలోని నల్గొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామం. ఆయనతో పాటు రాయగఢ్ ఏరియా కమిటీ సభ్యుడు, బారి అలియాస్ రాకేష్, మరొకరిని అమృత్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బారి తలపై రూ.22 లక్షల నగదు బహుమతి ఉండగా, అమృత్ తలపై రూ.1.65 లక్షల రివార్డు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో మిగతా వారిని గుర్తించాల్సి ఉందని తెలిపారు. కాగా ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ఈ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతుందని మరిన్ని బలగాలను మోహరించామని ఏడీజీ (యాంటీ నక్సల్ ఆపరేషన్స్) సంజీబ్ పాండా తెలిపారు.
ఘటనాస్థలిలో ఒక రివాల్వర్​, పాయింట్​ 303 రైఫిల్, ఒక వాకీ-టాకీ సెట్, రెండు ఐఎన్​ఎస్​ఏఎస్​ రైఫిల్స్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఒడిశా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టుల కోసం బలగాల గాలింపు కొనసాగుతోంది. కంధమాల్​, గంజాం జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో 20 స్పెషల్​ ఆపరేషన్స్​ గ్రూప్స్ (ఎస్​ఓజీ) బృందాలు, రెండు సెంట్రల్​ రిజర్వ్​ పోలీస్​ ఫోర్స్(సీఆర్​పీఎఫ్​) బృందాలు, ఒక బోర్డర్​ సెక్యూరిటీ ఫోర్స్​(బీఎస్​ఎఫ్​) దళాలతో కూడిన 23 బృందాలు మోహరించాయి.
ఒరిస్సా ఎన్ కౌంటర్ పై అమిత్ షా కీలక ట్వీట్
ఒరిస్సా కంద మాల్ ఎన్ కౌంటర్ పై అమిత్ షా కీలక ట్వీట్ చేశారు. ఈ ఎన్ కౌంటర్ లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయినట్లు అమిత్ షా తెలిపారు. ఎన్ కౌంటర్ లో కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్ ఉయికే మృతి చెందినట్లు వెల్లడించారు. ఈ కీలక విజయంతో, ఒడిశా నక్సలిజం నుండి పూర్తిగా విముక్తి పొందడానికి అంచున నిలిచింది. 2026 మార్చి 31వ తేదీలోపు నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించడానికి మేం కట్టుబడి ఉన్నాం" అని అమిత్ షా పోస్ట్ చేశారు. మావోయిస్టులు తమతో చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారని, ఇప్పుడు వారితో మాట్లాడడానికి ఏముందని ప్రశ్నించారు. బస్తర్ అంతటా ఉన్న మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ ప్రాంతంలో ఆయుధాలతో శాంతికి విఘాతం కలిగించే వారికి భద్రతా దళాలు తగిన సమాధానం ఇస్తాయని మావోయిస్టులను హెచ్చరించారు.
అయితే మార్చి 31, 2026 తర్వాత ఇటువంటి గ్రామాల అభివృద్ధిని మావోయిస్టులు అడ్డుకోలేరని అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు. గత పదేళ్లలో మోదీ ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్ అభివృద్ధి కోసం రూ.4లక్షల కోట్లకు పైగా నిధులు కేటాయించిందని, భవిష్యత్తులో మరిన్ని నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. దేశంలో నక్సలిజం సమస్య ఎందుకు తలెత్తిందని, వారికి సైద్ధాంతిక, ఆర్థిక, చట్టపరమైన మద్దతును ఎవరు అందిస్తున్నారని ప్రశ్నించారు.
Follow Us