బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను వరుసగా చుట్టుముడుతున్న వివాదాలు
సీనియర్ నేత వేధిస్తున్నాడని మహిళా కార్పొరేటర్ ఫిర్యాదుతో బీఆర్ఎస్లో కలకలం రేపుతోంది. అదే పార్టీకి చెందిన మహిళా ఫిర్యాదు చేయటం హాట్ టాపిక్‌గా మారింది.
సీనియర్ నేత వేధిస్తున్నాడని మహిళా కార్పొరేటర్ ఫిర్యాదుతో బీఆర్ఎస్లో కలకలం రేపుతోంది. అదే పార్టీకి చెందిన మహిళా ఫిర్యాదు చేయటం హాట్ టాపిక్‌గా మారింది.
హైదరాబాద్ మణికొండలోని ఓ ప్రైవేట్ ప్లే స్కూల్లో భారీ ప్రమాదం తప్పింది. పాఠశాలలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పాఠశాలలో ఉన్న చిన్నారులందరు భయంతో బయటకు పరుగులు తీశారు. ఘటనాస్ధలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే పనిలో పడ్డారు.
ఆషాఢ మాసంలో ప్రారంభం కాగానే.. పండగల కళ వచ్చేసింది.. నేడు కన్నులపండువగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం జరిగింది. ప్రతి సంవత్సరం ఆషాఢలో నిర్వహించే ఎల్లమ్మ కల్యాణ మహోత్సవాలకు నిన్నటి నుంచే పెద్దసంఖ్యలో భక్తులు హాజరైయ్యారు.
ఒకటికాదు, రెండుకాదు... అక్షరాల 8.5 కోట్లు దొచుకుని కేవలం ఫ్రీగా కూల్ డ్రింక్ దొరుకుతుందన్న కక్కూర్తితో అత్యాశకు పోయి, అడ్డంగా బుక్కైపోయిన గజ దొంగల స్టోరి ఇది. కేవలం 20 రూపాయల కూల్ డ్రింక్ తాగడం కోసం వచ్చిన దొంగలు తమ మొహాల మీద ముసుగు తీయగానే పోలీసులు వారిని గబక్కున పట్టుకున్నారు.
అట్లాంటిక్ మహాసముద్రంలో టైటానిక్ శకలాలను చూసేందుకు వెళ్లిన పర్యాటక జలాంతర్గామి అదృశ్యమైంది. ఈ జలాంతర్గామిలో పైలట్, నలుగురు పర్యాటకులు ఉన్నట్లు సమాచారం. దీని కోసం అమెరికా, కెనడా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.
జుట్టుంటేనే అందం...అది ఆడవారికైనా..మగవారికైనా..! పట్టుకుచ్చులాంటి మెరిసే నల్లటి నిగనిగలాడే కురులుంటే ఆ అందమే వేరు కదా. నలుగురిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా కనిపిస్తారు. ఎదుటివాళ్లను ఆకర్షించడంలోనే కాదు మనల్ని ప్రత్యేక వ్యక్తులుగా నిలబెడుతుందని. పొడవాటి, ఆరోగ్యకరమైన జుట్టు ఉండాలని ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మెరిసే జుట్టుకు సులభమైన మార్గాల్లో ఒకటి జుట్టుకు నూనెను రాయడం. నూనె ఆరోగ్యకరమైన జుట్టుకు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ దశబ్ది ఉత్సవాలు కొనసాగుతున్నాయి. పుల్లూరులో మొక్కలు నాటిన మంత్రి తన్నీరు హరీష్‌రావు. తెలంగాణ రాకుంటే సీఎం కేసీఆర్ కాకుంటే ఇవన్నీ సాధ్యమయ్యేనా అని మంత్రి గుర్తిచేశారు.
ఈ ఆధునిక జీవితంలో...కాలంతో పోటీ పడుతూ పరుగెత్తాల్సిందే. దీంతో శారీరకంగా, మానసికంగా అలసటకు గురవుతున్నారు. ఈ అలసట నుంచి ఉపశమనం పొందేందుకు సహజసిద్ద మార్గం యోగా. అందుకే ఈ మధ్యకాలంలో యోగా, నేచురోపతి విధానాలను అనుసరించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో ఈ నైపుణ్యాలున్నవారికి డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఆసక్తి ఉన్న యువత దీన్ని ఉపాధి మార్గం కూడా ఎంచుకోంటోంది. అయితే యోగాతో ప్రభుత్వ ఉద్యోగాలు కూడా పొందవచ్చు. ఇంటర్, డిగ్రీ అర్హతతో యోగా,నేచురోపతి కోర్సుల్లో చేరితే ప్రభుత్వ ఉద్యోగం పొందడం చాలా సులువు.
నిజామాబాద్ జిల్లాలో మరోసారి ఫ్లెక్సీల రగడ మొదలైంది. ఎమ్యెల్యే ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని ఉద్ద్యేశించి జిల్లావ్యాప్తంగా ప్లెక్సీలు వెలిశాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా తీవ్రదుమారం రేపుతున్నాయి. అసలెవరు ఈ ప్లెక్సీలను ఏర్పాటు చేశారనేదే ప్రస్తుతం జిల్లాలో హాట్ టాఫిక్‌గా మారింది..