అందాన్ని రెట్టింపు చేసేది జుట్టు. నేటికాలంలో చాలా మంది జుట్టు సమస్య ఎదుర్కొంటున్నారు. చిన్న వయస్సులోనే జుట్టు ఊడిపోతుంది. మగవాళ్లకు అయితే 25ఏళ్లు నిండకముందే బట్టతల వచ్చేస్తుంది. దీంతో 20లోనే 40లా కనిపిస్తున్నారు. ఇక ఆడవాళ్లు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. జుట్టు రాలకుండా ఉండేందుకు మార్కెట్లో దొరికే ఖరిదైన ఉత్పత్తులు వాడినప్పటికీ అది తాత్కాలికంగానే ప్రభావం చూపుతాయి. అంతేకాదు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి.
అయితే చాలా కాలంగా జుట్టు సంరక్షణలో భాగంగా నూనెను పూయడం ఒక అలవాటు. జుట్టుకు నూనెను పూయడం చాలా అవసరం. అవి మీస్పాల్ప్ ను తేమగా మార్చడంతోపాటు..జుట్టును వేగంగా పెరిగేలా చేస్తుంది. ఆరోగ్యకరమైన జుట్టుకోసం మీరు అనేక రకాల నూనెలను ఉపయోగించవచ్చు. కొబ్బరినూనె, బాదం, ఆముదం, ఆలివ్, నువ్వుల నూనె ఇలా మొదలైనవి ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యమైంది నువ్వుల నూనె. ఈ నూనెను జుట్టుకు అప్లయ్ చేయడం వల్ల జుట్టు బలంగా మారుతుంది.
నువ్వుల నూనె ప్రయోజనాలు:
నువ్వుల నూనెలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, ఫైటోస్టెరాల్స్, ప్రోటీన్లలో సమృద్ధిగా ఉంటాయి. ఈ నూనెలో ఒమేగా-3, ఒమేగా-6, ఒమేగా-9 ఫ్యాటీ యాసిడ్‌లు కూడా ఉన్నాయి, ఇవి జుట్టు పెరుగుదలతో పాటు స్కాల్ప్‌ను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అయితే విశేషమేమిటంటే జుట్టు రాలడానికి ఈ నూనెను ఉపయోగించవచ్చు. అంతే కాదు, చుండ్రు సమస్యను దూరం చేయడానికి కూడా ఈ నూనెను ఉపయోగించవచ్చు.
1. పొడి జుట్టు కోసం నువ్వుల నూనె:
మీ జుట్టు చాలా పొడిగా, నిర్జీవంగా ఉంటే, నువ్వుల నూనెతో కలబందను కలిపి అప్లై చేయడం వల్ల అనేక విధాలుగా ప్రయోజనం ఉంటుంది. ఇది దాని హైడ్రేటింగ్ లక్షణాలతో జుట్టుకు తేమను అందించడంతోపాటు పొడిని తగ్గిస్తుంది. ఇది కాకుండా, రెండూ స్కాల్ప్ రంధ్రాలలో తేమను లాక్ చేస్తాయి, తద్వారా అవి కొంతకాలం తర్వాత మళ్లీ పొడిగా మారవు.
2. జుట్టు రాలకుండా:
నువ్వుల నూనెలో ప్రోటీన్ అనేక సమ్మేళనాలు ఉన్నాయి. ఇది అన్ని కొవ్వు ఆమ్లాలలో కూడా సమృద్ధిగా ఉంటుంది. జుట్టుకు అప్లై చేసినప్పుడు, జుట్టు మూలాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. మీరు చేయాల్సిందల్లా మెంతులు పౌడర్ ను నువ్వుల నూనెలో కలపాలి. ఇప్పుడు ఈ నూనెను మీ తలకు పట్టించండి. కాసేపు అలాగే ఉంచి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ నూనెను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల మీ జుట్టు రాలడం తగ్గుతుంది.
3.తెల్లవెంట్రుకలకు చెక్:
నెరిసిన జుట్టు కోసం నువ్వుల నూనెను ఉపయోగించడం చాలా రకాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ, గోరింటలో నువ్వుల నూనె కలిపి ఉపయోగించడం అత్యంత ప్రభావవంతమైన మార్గం. ఇది మీ జుట్టు రంగును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా కాఫీ పౌడర్, పెరుగు, నిమ్మకాయ, నువ్వుల నూనెను కలిపి హెయిర్ ప్యాక్‌ను సిద్ధం చేసుకోవచ్చు. ఇది మీ జుట్టు నెరవడాన్ని తగ్గిస్తుంది. అలాగే, ఈ హెయిర్ ప్యాక్ చుండ్రును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. కాబట్టి, ఆరోగ్యకరమైన జుట్టు కోసం నువ్వుల నూనెను ప్రయత్నించండి.