సీఎం కేసీఆర్ వల్లే అన్ని సాధ్యమన్న మంత్రి హరీష్‌రావు

తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ దశబ్ది ఉత్సవాలు కొనసాగుతున్నాయి. పుల్లూరులో మొక్కలు నాటిన మంత్రి తన్నీరు హరీష్‌రావు. తెలంగాణ రాకుంటే సీఎం కేసీఆర్ కాకుంటే ఇవన్నీ సాధ్యమయ్యేనా అని మంత్రి గుర్తిచేశారు.

New Update
సీఎం కేసీఆర్ వల్లే అన్ని సాధ్యమన్న మంత్రి హరీష్‌రావు

Siddipet Rural Mandal Pulluru Decade Festivals

ఘనంగా దశబ్ది ఉత్సవాలు

సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామంలోని రింగ్ రోడ్డు వద్ద తెలంగాణ రాష్ట్ర అవతరణ దశబ్ది ఉత్సవాల్లో భాగంగా హరిత ఉత్సవం కార్యక్రమం ద్వారా మొక్కలు నాటిన మంత్రి హరీష్‌రావు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్‌ఫర్సన్ రోజా రాధాకృష్ణశర్మ, జిల్లా కలెక్టర్ ప్రశాంత్‌జే పాటిల్, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, డీఎఫ్‌వో శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

చెట్లు తొలగించడంతో ఎంతో బాధ

ఈ సందర్బంగా మంత్రి తన్నీరు హరీష్‌రావు మాట్లాడుతూ 160 కోట్ల రూపాయలతో 41 కిలోమీటర్ల రింగ్ రోడ్డును యుద్ధ స్పూర్తితో 4 నెలల్లో పూర్తి చేశామని వెల్లడించారు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌ఫోర్ట్ రన్వేను తలపించేలా రింగ్ రోడ్డు నిర్మాణం జరిగిందని, రింగు రోడ్డు నిర్మాణంలో చెట్లు తొలగించడంతో ఎంతో బాధ కలిగి రింగ్‌ రోడ్డు చుట్టూ రెండు వైపులా మొక్కలు నాటి పెద్దవి చేసేందుకు 3 కోట్ల 34 లక్షల రూపాయలతో అటవీ శాఖ మొక్కలు నాటే కార్యక్రమంను ఈరోజు ప్రారంభించామని తెలిపారు.

ఇవన్నీ కేసీఆర్‌తోనే సాధ్యం

మన ప్రజలు మన ప్రాంతం అనే చిత్తశుద్ధితో చేస్తున్న పనులకు ఇది నిదర్శనమని మంత్రి వ్యాఖ్యానించారు. తెలంగాణ రాకుంటే సీఎం కేసీఆర్ కాకుంటే ఇవన్నీ సాధ్యమయ్యేనా అని అన్నారు. తాజాగా పుల్లూరులో 9 కోట్ల రూపాయలతో రహదారుల అభివృద్ధికి ఈరోజు శంకుస్థాపన చేశామని, పీడబ్ల్యూడీ రోడ్డు నుండి పుల్లూరు వరకు 2 కోట్ల 95 లక్షల రూపాయలతో డబుల్ లైన్ బీటీ రోడ్డు, పుల్లూరు ఎస్సీ కాలనీ నుండి రామంచ వరకు 3 కోట్లతో బీటీ రోడ్డు, నారాయణరావుపేటకు 1.80 కోట్లతో రోడ్డు, గాడిచర్ల మీదుగా నాసర్‌పురా వరకు 1 కోటి 56 లక్షల రూపాయలతో రోడ్డు మరమ్మత్తు పనులు, 40 పుల్లూరు గ్రామంలో సీసీ రోడ్లు నిర్మాణ పనులు చేపట్టామని మంత్రి తెలిపారు.

రైతన్నలు అధైర్య పడొద్దు

అంతేకాకుండా పీహెచ్‌సీ, ఏఎన్ఎం సబ్‌ సెంటర్, అర్బన్ పీహెచ్‌సీ మరమత్తు పనులను డీఎం అండ్ హెచ్‌వో త్వరగా పూర్తి చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎల్‌నీనో ప్రభావంతో వర్షాలు పడకున్న మల్లన్నసాగర్, రంగనాయక సాగర్ నుంచి పంటలకు సాగునీరు అందిస్తా రైతులు అధైర్య పడొద్దని మంత్రి హరీష్‌రావు సూచించారు. తక్కువ నీటితో తక్కువ సమయంలో పండే పంటలను వేయాలని, అధిక లాభాలను అర్జించే పామాయిల్ తోటలను పెంచాలని విజ్ఞప్తి చేశారు. వర్ష భావంతో మహారాష్ట్రలో త్రాగునీరు సరఫరాకు కొత్త పెట్టారు. రాష్ట్రంలో జులై 10 వరకు వర్షం పడదని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో కాలేశ్వరం గోదావరి నీటితో మనం వర్షాభావాన్ని ఎదుర్కొంటున్నామన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు