బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను వరుసగా చుట్టుముడుతున్న వివాదాలు సీనియర్ నేత వేధిస్తున్నాడని మహిళా కార్పొరేటర్ ఫిర్యాదుతో బీఆర్‌ఎస్‌లో కలకలం రేపుతోంది. అదే పార్టీకి చెందిన మహిళా ఫిర్యాదు చేయటం హాట్ టాపిక్‌గా మారింది. By Vijaya Nimma 20 Jun 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి మహిళను వేధిస్తున్న బీఆర్ఎస్ సీనియర్ నేత తెలంగాణలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. తనను వేధిస్తున్నారని బీఆర్‌ఎస్ సీనియర్ నేతపై ఓ మహిళ ఆరోపణలు చేశారు. ఆ తర్వాత దుర్గం చిన్నయ్యపై శైజల్ అనే మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. ఇప్పుడు ఈ కేసులో జాతీయ మానవహక్కుల కమిషన్ విచారిస్తోంది. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డిపై సొంత కుమార్తె భూకబ్జా ఆరోపణలు చేశారు. ఇప్పుడు మరో సీనియర్ నేతపై హైదరాబాద్ కార్పొరేటర్ వేధిస్తున్నారని అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారన్న వార్త సంచలనంగా మారింది. అర్థరాత్రిలో సోది కబుర్లు అధికార పార్టీ బీఆర్‌ఎస్‌కు చెందిన ఓ సీనియర్ నేతపై అదే పార్టీకి చెందిన కార్పొరేటర్ ఫిర్యాదు చేశారట. అర్థరాత్రి ఫోన్ చేసిన సదరు నేత యోగక్షేమాలు అడిగారని.... అలా మాట్లాడుతూనే వాయిస్‌లో మార్పు వచ్చిందని సమాచారం. అప్పటి వరకు ఆదర్శ నాయకుడు అనుకున్న వ్యక్తి అలా మాట్లాడేసరికి మహిళా కార్పొరేటర్ కంగుతిన్నారట. ఏం చేయాలో అర్థం కాలేదామెకు అని చెబుతున్నారు. టెన్షన్‌లో కూడా ఆ లీడర్ వాయిస్‌ను రికార్డు చేశారని చెప్పుకుంటున్నారు. ఆయన చెప్పినవన్నీ విన్న కార్పొరేటర్... అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారని టాక్. తాను రికార్డు చేసిన ఆడియోను అధినాయకత్వానికి అందించినట్టు తెలుస్తోంది. రాజకీయాల్లో భాగంగా తిరిగినంత మాత్రాన తప్పుగా అర్థం చేసుకుంటే ఎలా అంటూ వాపోయారట. ఓ మంత్రి వద్ద విషయాన్ని ప్రస్తావించినట్టు సమాచారం అందుతోంది. నిఘా పెట్టిన అధికార పార్టీ ఫిర్యాదు అందుకున్న అధిష్ఠానం ఆయనపై నిఘా పెట్టింది. అన్ని వర్గాల నుంచి సమాచారాన్ని సేకరిస్తోంది. ఆయనపై గతంలో ఇలాంటి ఆరోపణలు ఏమైనా ఉన్నాయా... అన్న కోణంలో సీక్రెట్‌గా విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇవ్వదు ఇప్పటికే ఇలాంటి విషయంలోనే వరంగల్‌కు చెందిన లీడర్లు బద్నాం అవుతున్నారు. రాజయ్య లాంటి వారు ఇలాంటి ఆరోపణలతోనే మంత్రి పదవి కూడా పోగొట్టుకున్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న టైంలో ఏ చిన్న అవకాశం దొరినా ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇచ్చినట్టే అవుతుందని అధికార పార్టీ టెన్షన్. అందుకే హైదరాబాద్ పార్టీ నేతల విషయాన్ని బయటకు వెళ్లకుండా సీక్రెట్‌గా ఎంక్వయిరీ చేస్తున్నట్టు చెబుతున్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి