బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవంలో అపశృతి

ఆషాఢ మాసంలో ప్రారంభం కాగానే.. పండగల కళ వచ్చేసింది.. నేడు కన్నులపండువగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం జరిగింది. ప్రతి సంవత్సరం ఆషాఢలో నిర్వహించే ఎల్లమ్మ కల్యాణ మహోత్సవాలకు నిన్నటి నుంచే పెద్దసంఖ్యలో భక్తులు హాజరైయ్యారు.

New Update
బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవంలో అపశృతి

Balkampet Yellamma Kalyanam

రేణుక ఎల్లమ్మ కల్యాణ ఏర్పాట్లలో ప్రభుత్వ అధికారులు వైఫల్యం కొట్టోచినట్లు కనిపిస్తున్నాయి. ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం సందర్భంగా జరిగిన ఏర్పాట్లలో అపశృతి ఏర్పడింది. భక్తులకి సరైన సౌకర్యాలు కల్పించడంలో గుడి యాజమాన్యం మరియు పోలీస్ అధికారులు విఫలమైయ్యారు. ఆర్భాటంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పుకుంటున్న దానిలో వాస్తవం మాత్రం లేదని తెలుస్తోంది. అమ్మవారి వారి కల్యాణ్యానికి భక్తులు పెద్దసంఖ్యలో వచ్చారు. రద్దీని సరిగ్గా నిర్వహించ లేక పోవడంతో ఓ మహిళల తప్పిపోగా..దర్శనం కోసం వచ్చిన ఓ వృద్ధురాలు కరెంట్ షాక్‌కు గురైంది.ఏర్పాట్ల నిర్వహణలో వైఫల్యం చెందడం పట్ల భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అంగరంగ వైభవంగా అమ్మవారి కల్యాణం

హైదరాబాద్ బల్కంపేట ఆలయంలో ఎల్లమ్మ కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా.. ఆషాఢ మాసం మొదటి మంగళవారంలో జరిగే ఈ ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఇవాళ ఉదయం 9:30 గంటలకు అమ్మవారి కల్యాణ వేడుక ప్రారంభమైంది. ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ కుటుంబసమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. అలానే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అమ్మవారిని దర్శించుకున్నారు.

రేపు సాయంత్రం రథోత్సవం

ఎల్లమ్మ కల్యాణాన్ని తిలకించేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలిరావటంతో.. ఆలయ ప్రాంతాలు భక్తజన సంద్రంగా మారాయి. భక్తుల రాక కోసం ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేశారు. కల్యాణ వేడుక సందర్భంగా ఆలయాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించిన పోలీసులు.. భారీగా బందోబస్తును సిద్ధం చేశారు. ఎల్లమ్మ కల్యాణోత్సవాల్లో భాగంగా నిన్న ఎదుర్కోళ్లు నిర్వహించగా... ఇవాళ అంగరంగ వైభవంగా ఎల్లమ్మ కల్యాణం సాగింది. రేపు సాయంత్రం రథోత్సవం నిర్వహించనున్నారు. కల్యాణోత్సవంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో కొంత సేపు తోపులాట జరిగింది. వీఐపీ పాస్​లు ఎక్కువ ఇవ్వడం వల్లే రద్దీ పెరిగిందని భక్తులు ఆరోపిస్తున్నారు.

అంతంత మాత్రంగానే ఏర్పాట్లు

భక్తులకు ఇబ్బందులు లేకుండా బారికేట్లను ఏర్పాటు చేశారు. అలాగే అమ్మవారి ప్రసాదం లడ్డూలు, పులిహోర ప్యాకెట్లు ఎప్పటికప్పుడు సిద్ధం చేస్తున్నారు. గత సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ కళ్యాణానికి వచ్చారు. ఈ సారి కూడా భారీ స్థాయిలో వచ్చే అవకాశం ఉంది. దీంతో అన్ని ఏర్పాట్లు చేశారు. కల్యాణ మహోత్సవాల నేపథ్యంలో ట్రాఫిక్‌ను ఆంక్షలు విధించారు పోలీసు అధికారులు .

Advertisment
Advertisment
తాజా కథనాలు