Murder : నెల్లూరు లో దారుణ హత్య ! అందరూ చూస్తుండగానే కత్తులతో..

నెల్లూరు పట్టణంలో రాత్రి అందరూ చూస్తుండగానే ఒక యువకున్ని దారుణంగా హత్య చేశారు. శుక్రవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఓ రౌడీ షీటర్‌ ను ప్రత్యర్థులు హత్యచేయడం కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు యువకున్నిఅతికిరాతకంగా కత్తులతో  నరికి చంపారు.

New Update
Rowdy sheeter chintu

Rowdy sheeter chintu

Murder : నెల్లూరు పట్టణంలో రాత్రి అందరూ చూస్తుండగానే ఒక యువకున్ని దారుణంగా హత్య చేశారు. శుక్రవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఓ రౌడీ షీటర్‌ ను ప్రత్యర్థులు హత్యచేయడం కలకలం రేపింది. సీని ఫక్కీలో బైక్ పైవచ్చిన  గుర్తు తెలియని వ్యక్తులు యువకున్ని తరిమి..తరిమి అతికిరాతకంగా కత్తులతో  నరికి చంపారు. కాగా మృతుడు హౌసింగ్ బోర్డు కాలనీ కీ చెందిన రౌడీ షీటర్..సుజన్ కృష్ణ ఉరఫ్ చింటూ గా గుర్తించారు. చింటూ పై పలు కేసులతో పాటు వేదాయపాలెం పోలీసుస్టేషన్‌లో రౌడీషీటు ఉంది. గతంలో జరిగిన పలు హత్యలు, హత్యాయత్నం కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. 

ఇది కూడా చదవండి: Delimitation: డీలిమిటేషన్‌ వల్ల సీట్లు తగ్గుతాయా ? కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

నగరంలోని పొదలకూరురోడ్డు ఇందిరాగాంధీ నగర్‌ రెండో వీధిలో  చింటూ 9.30 నిమిషాలకు నిలబడి ఉండగా గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు మోటార్ సైకిల్ మీద వచ్చి కత్తులతో అతి దారుణంగా పొడిచి చంపారు. మృతుడు తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ తరిమి తరిమి చంపారు.  సమాచారం అందుకున్న వేదాయపాలెం ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసులురెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరి శీలించారు.

Also Read: Bsnl Cheapest Recharge Plan: ఓరి దేవుడా.. రూ.750లకే 6 నెలల వ్యాలిడిటీ- 180 GB డేటా కూడా!

ఘటన జరిగిన తీరును బట్టి పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు చింటూను ఫోను చేసి పిలిపించారని తెలిసింది. పోలీసులు స్థానిక సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. పక్కా ప్రణాళికతోనే హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఐదవ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో నిత్యం నేరాలు జరుగుతున్నా.. పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవ హరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మద్యం షాపు లు 24 గంటలు తెరిచి ఉన్న పట్టించుకొనే వారు లేకుండ పోయారనే విమర్శ ఉంది.

ఇది కూడా చూడండి: Punjab: స్వర్ణదేవాలయం దగ్గర గుర్తు తెలియని వ్యక్తి హల్ చల్..ఐదుగురికి గాయాలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు