Kakani Govardhan Reddy : మాజీమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి బెయిల్ మంజూరు

మాజీ మంత్రి, వైపీపీ నాయకుడు కాకాణి గోవర్ధన్‌ రెడ్డికి బెయిల్‌ మంజూరైంది. వెంకటాచలం పోలీసుస్టేషన్‌ పరిధి కనుపూరు గ్రామ చెరువు నుంచి అక్రమంగా మట్టి తవ్వి తరలించారంటూ ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కాకాణి గోవర్ధన్‌ రెడ్డికి బెయిల్‌ మంజూరైంది.

New Update
Kakani Govardhan Reddy

Kakani Govardhan Reddy

Kakani Govardhan Reddy: మాజీ మంత్రి, వైపీపీ నాయకుడు కాకాణి గోవర్ధన్‌ రెడ్డికి బెయిల్‌ మంజూరైంది. వెంకటాచలం పోలీసు స్టేషన్‌ పరిధిలోని కనుపూరు గ్రామ చెరువు నుంచి అక్రమంగా మట్టి తవ్వి తరలించారంటూ ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు కాకాణి గోవర్ధన్‌ రెడ్డికి బెయిల్‌ మంజూరు చేస్తూ నెల్లూరు 4వ అదనపు జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ నిషాద్‌ నాజ్‌ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రూ.25వేల పూచీకత్తుతో ఇద్దరు జామీనుదారుల హామీతో బెయిల్‌పై విడుదల చేయాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దర్యాప్తు సందర్భంలో పోలీసులకు సహకరించాలని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి:తెలంగాణ రైతులకు శుభవార్త.. కొత్త పాస్‌బుక్ వచ్చిన వారందరికీ ఈ నెలలో రైతు బీమా

కాగా, కనుపూరు చెరువు నుంచి మట్టిని అక్రమంగా తరలించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినట్లు వెంకటాచలం పోలీసులు కాకాణిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి బెయిల్‌ మంజూరు చేస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.. దీనికి గాన ఒక్కొక్కరు రూ.25 వేలు ఆస్తి విలువ కలిగిన ఇద్దరు జామీన్‌దారుల పూచీకత్తు, రూ.25,000 వ్యక్తిగత బాండ్‌ సమర్పించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కాగా బెయిల్‌ సమయంలో  పోలీసుల విచారణకు కాకాణి సహకరించాలని న్యాయమూర్తి తన  ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి:సీఎం రేవంత్ సొంత జిల్లాలో బీజేపీ మాస్టర్ ప్లాన్.. ఆ ఐదుగురు నేతలు జంప్?

ఈ కేసులో కాకాణి తరఫున సీనియర్‌ న్యాయవాదులు రామిరెడ్డి రోజారెడ్డి పి.ఉమామహేశ్వర్‌రెడ్డి, ఎంవీ విజయకుమారి, సిద్ధన సుబ్బారెడ్డి బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.అయితే  ఈ కేసులో కాకాణిపై ప్రాథమిక ఆధారాల్లేవని, కేవలం రాజకీయ కక్షతో మొదటి నిందితుడిగా కేసు బనాయించారని న్యాయవాదులు వాదనలు వినిపించారు, వెంకటాచలం పోలీసులు తరఫున పీపీ మాల్యాద్రి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి కాకాణికి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేశారు. 

Also Read: ముసలోడే కానీ మహానుబావుడు.. నలుగురు అమ్మాయిలతో 21 నెలలు 734 సార్లు!!

Advertisment
తాజా కథనాలు