/rtv/media/media_files/2026/02/26/ncert-2026-02-26-13-12-22.jpg)
NCERT
NCERT: దేశ అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) బుధవారం ఒక స్కూల్ బుక్(textbooks) అంశంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 8వ తరగతి సోషల్ స్టడీస్ పుస్తకంలో 'న్యాయవ్యవస్థలో అవినీతి' అనే శీర్షికతో పాఠ్యాంశాన్ని చేర్చడంపై ధర్మాసనం వ్యక్తం చేసింది. ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థను అవమానించేలా పాఠాలు ఉంటే చూస్తూ ఊరుకోబోమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. విద్యా వ్యవస్థలో సంస్కరణలు చేసే క్రమంలో రాజ్యాంగబద్ధమైన సంస్థల ప్రతిష్ఠకు భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: ఇట్స్ పూల్ టైమ్.. తడి అందాలతో రెచ్చిపోయిన నేహా శర్మ
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) ప్రచురించిన 8వ తరగతి నూతన పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థకు సంబంధించిన అధ్యాయంలో 'అవినీతి' గురించి ప్రస్తావించారు. దీనిపై సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీలు ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ దృష్టికి తీసుకెళ్లారు. చిన్న వయసులోనే విద్యార్థులకు ఇలాంటి అంశాలు బోధించడం వల్ల న్యాయవ్యవస్థపై ఉన్న నమ్మకం సడలిపోతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read: మొత్తానికి ఒక్కటైన విజయ్- రష్మిక..
సుప్రీంకోర్టు హెచ్చరిక
ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించిన చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ తీవ్రంగా స్పందించారు. "ఒక సంస్థను కించపరుస్తామంటే ఎవరినీ అనుమతించే ప్రసక్తే లేదు. ఇదేం పద్ధతి? ఇది ప్రణాళికాబద్ధంగా, ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నంలా కనిపిస్తోంది" అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై తనకు ఇప్పటికే అనేక ఫోన్ కాల్స్, సందేశాలు వచ్చాయని, దీనిని ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసని చెబుతూ.. గురువారం విచారణ చేపడతామని వెల్లడించారు.
Also Read: యష్ టాక్సిక్ నయా ప్లాన్.. ఐమ్యాక్స్ వెర్షన్ షురూ!
NCERT దిద్దుబాటు చర్యలు
కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన కొద్దిసేపటికే NCERT రంగంలోకి దిగింది. ఈ పాఠ్యాంశంపై అధికారికంగా విచారం వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేసింది. రాజ్యాంగ అక్షరాస్యత, ప్రజాస్వామ్య భాగస్వామ్యంపై అవగాహన పెంచడమే తమ లక్ష్యమని, ఏ సంస్థను తక్కువ చేయాలనే ఉద్దేశం తమకు లేదని పేర్కొంది. ఇప్పటికే ముద్రించిన సుమారు 2.25 లక్షల కాపీలను గిడ్డంగులకు వెనక్కి రప్పించినట్లు విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అనుచిత అంశాలను తొలగించిన తర్వాతే కొత్త పుస్తకాలను పంపిణీ చేస్తామని తెలిపింది.
Follow Us