/rtv/media/media_files/2026/02/26/ncert-2026-02-26-21-35-26.jpg)
NCERT
జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి (NCERT) 8వ తరగతి సోషల్ బుక్‌లో న్యాయవ్యవస్థలో అవినీతి అంటూ ప్రచురించిన పాఠ్యాంశం తీవ్ర దుమారం రేపింది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ఈ బుక్‌పై నిషేధం విధించింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై స్పందించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అంశం తన దృష్టికి వచ్చిన వెంటనే ఆ బుక్‌లను సర్క్యులేషన్లో లేకుండా వెనక్కి తీసుకోవాలని NCERTకి ఆదేశించినట్లు పేర్కొన్నారు.
Also Read: విమాన ప్రయాణికలకు గుడ్‌న్యూస్.. టికెట్ క్యాన్సిల్ చేస్తే ఫుల్ రిఫండ్
న్యాయవ్యవస్థను అగౌరపర్చాలనే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదన్నారు. ఈ విషయాన్ని సీరియగ్ తీసుకున్నామని.. న్యాయ వ్యవస్థకు తాము గౌరవం ఇస్తామని తెలిపారు. కోర్టు నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని చెప్పారు. అంతేకాదు NCERTపై విచారణ చేస్తామని.. దీనికి బాధ్యులైన వాళ్లపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటామని స్పష్టం చేశారు.
Also Read: వాహనాదారులకు అలెర్ట్.. ఆ తప్పు చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
మరోవైపు సోషల్ బుక్‌లోని ఈ పాఠ్యాంశాన్ని సీరియస్‌గా తీసుకున్న సుప్రీంకోర్టు దీనిపై సుమోటోగా విచారణ చేపట్టింది. న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతిసేందుకు ఇదొక కుట్ర అంటూ మండిపడింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తరఫు సొలసిటర్ జనరల్ తుషార్ మెహతా క్షమాపణలు చెప్పారు. మరోవైపు NCERT సైతం తమ అధికారిక వెబ్సైట్ నుంచి ఈ బుక్‌ను తొలగించింది. దీన్ని ప్రచురించినందుకు క్షమాపణలు కూడా తెలియజేసింది.
Follow Us