Bengaluru : పట్టపగలే దారుణం..  కారు బోనెట్‌పై కిలోమీటరు ఈడ్చుకెళ్లాడు

పాత విమానాశ్రయం రోడ్డు  వంటి రద్దీగా ఉండే ప్రాంతంలో, ఒక వ్యక్తిని కారు బోనెట్‌పై ఎక్కించుకుని దాదాపు ఒక కిలోమీటర్ దూరం వేగంగా తీసుకెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో  వైరల్‌గా మారాయి

New Update
car

బెంగళూరు(bengaluru) లో పట్టపగలే అత్యంత భయంకరమైన రోడ్ రేజ్ ఘటన చోటుచేసుకుంది. పాత విమానాశ్రయం రోడ్డు  వంటి రద్దీగా ఉండే ప్రాంతంలో, ఒక వ్యక్తిని కారు(car) బోనెట్‌పై ఎక్కించుకుని దాదాపు ఒక కిలోమీటర్ దూరం వేగంగా తీసుకెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో  వైరల్‌గా మారాయి. మంగళవారం మధ్యాహ్నం 12:45 గంటల ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన చూసిన వారందరినీ షాక్‌కు గురిచేసింది.

Also Read :  మాస్‌ కాపీయింగ్‌.. 17 మంది టీచర్లపై కేసు

డ్రైవర్ సురేష్ వేగంగా ముందుకు

అసలేం జరిగిందంటే, పులకేశి నగర్‌కు చెందిన సురేష్ (52) అనే వ్యక్తి తన ఎక్స్‌ఎల్ 6 (XL6) కారులో వెళ్తుండగా, వ్యాపారవేత్త నంజుండ ప్రయాణిస్తున్న వాహనంతో చిన్నపాటి వివాదం తలెత్తింది. ఈ క్రమంలో నంజుండ కారును ఆపే ప్రయత్నం చేయగా, డ్రైవర్ సురేష్ వేగంగా ముందుకు పోనిచ్చాడు. దీంతో ప్రాణరక్షణ కోసం నంజుండ కారు బోనెట్‌పైకి ఎక్కి వైపర్లను గట్టిగా పట్టుకున్నాడు. బాధితుడు కేకలు వేస్తూ, ఆపమని వేడుకుంటున్నా డ్రైవర్ మాత్రం దాదాపు 80 కిలోమీటర్ల వేగంతో ట్రాఫిక్‌లో కారును పోనిచ్చాడు.

చివరకు తోటి వాహనదారులు, క్యాబ్ డ్రైవర్లు కారును అడ్డగించి ఆపడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న హలసూరు పోలీసులు వెంటనే స్పందించి సురేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై హత్యాప్రయత్నం కింద కేసు నమోదు చేసి, కారును స్వాధీనం చేసుకున్నారు. విచారణలో సురేష్ గతంలో కూడా అతివేగంగా కారు నడిపి నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలింది. నగరాల్లో పెరుగుతున్న రోడ్ రేజ్ సంస్కృతికి ఈ ఘటన ఒక నిదర్శనంగా నిలిచింది. - Viral Video

Also Read :  కేంద్రం సంచలనం.. 114 యుద్ధ విమానాలకు గ్రీన్ సిగ్నల్!

Advertisment
తాజా కథనాలు