Passport Ranking: ఇండియాకు ఇరాన్, బొలివియా బిగ్ షాక్.. వీసా లేకుండా రావద్దన్న దేశాలు

2026కు సంబంధించి తాజాగా విడుదలైన హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ రిపోర్ట్‌లో ఇండియన్ పాస్‌పోర్ట్ తన శక్తిని చాటుకుంది. గతేడాదితో పోలిస్తే భారత ర్యాంకింగ్ బాగా పెరిగినప్పటికీ, కొంత నిరాశ కలిగించే అంశం కూడా తెరపైకి వచ్చింది.

New Update
Passport Ranking

ఇండియా విదేశాలతో సంబంధాలు పెరుగుతున్నాయి. 2026కు సంబంధించి తాజాగా విడుదలైన హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ రిపోర్ట్‌లో ఇండియన్ పాస్‌పోర్ట్ తన శక్తిని చాటుకుంది. గతేడాదితో పోలిస్తే భారత ర్యాంకింగ్ బాగా పెరిగినప్పటికీ, కొంత నిరాశ కలిగించే అంశం కూడా తెరపైకి వచ్చింది.

ఇండియా పాస్‌పోర్ట్ రాంకింగ్‌(passport ranking) లో గతేడాది 85వ స్థానంలో ఉన్నా, ఇప్పుడు ఏకంగా 10 స్థానాలు ఎగబాకి 75వ స్థానానికి చేరుకుంది. భారత పాస్‌పోర్ట్ బలోపేతం అవుతున్నట్లు ఈ ర్యాంకింగ్ సూచిస్తున్నప్పటికీ, నో వీసా ఎంట్రీ(Visa-Free Entry) దేశాల సంఖ్యలో మాత్రం స్వల్ప తగ్గుదల కనిపించింది. పాస్‌పోర్ట్ ర్యాంక్ పెరిగినప్పటికీ, భారతీయ పర్యాటకులు వీసా లేకుండా ప్రయాణించే దేశాల జాబితా 57 నుండి 55కి తగ్గింది. ఇరాన్, బొలీవియా దేశాలు వీసా లేకుండా భారతీయులను వారి దేశాల్లోకి అనుమతిస్తున్నట్లు ప్రకటించాయి. 

Also Read :  షేక్ హసీనాకు షాకిచ్చిన BNP.. బంగ్లాదేశ్‌కు రప్పించేందుకు ప్రయత్నాలు

India's Passport Ranking Rises 10 Places

ఇరాన్: భద్రతా కారణాల దృష్ట్యా, అక్రమ రిక్రూట్‌మెంట్ సమస్యల నేపథ్యంలో ఇరాన్ భారతీయులకు కల్పిస్తున్న ద్వైపాక్షిక వీసా రహిత ప్రవేశాన్ని నిలిపివేసింది. ఇప్పుడు భారతీయ పర్యాటకులు అక్కడికి వెళ్లాలంటే ముందుగానే రెగ్యులర్ వీసా దరఖాస్తు చేసుకోవాలి.
బొలీవియా: ఈ దక్షిణ అమెరికా దేశం గతంలో భారతీయులకు 'వీసా ఆన్ అరైవల్' సౌకర్యాన్ని ఇచ్చేది. అయితే, జనవరి 2026 నుండి బొలీవియా ఈ విధానాన్ని రద్దు చేసి, దాని స్థానంలో ఇ-వీసా (e-Visa) విధానాన్ని తప్పనిసరి చేసింది. దీనివల్ల ప్రయాణికులు వెళ్లే ముందే ఆన్‌లైన్‌లో అనుమతి పొందాల్సి ఉంటుంది.

ప్రస్తుతం భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లు 55 దేశాలకు వీసా లేకుండా లేదా 'వీసా ఆన్ అరైవల్' సౌకర్యంతో వెళ్లవచ్చు. గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో సింగపూర్ తన అగ్రస్థానాన్ని నిలుపుకోగా, భారత్ తన దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగుతోంది. థాయ్‌లాండ్, మలేషియా వంటి దేశాలు ఇప్పటికీ భారతీయులకు వీసా రహిత సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ప్రయాణికులు విదేశాలకు వెళ్లే ముందు ఆయా దేశాల తాజా వీసా నిబంధనలను చెక్ చేసుకోవడం ఉత్తమం.

Also Read :  85 శాతం కంటి చూపు కోల్పోయిన ఇమ్రాన్: పాక్ సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం!

Advertisment
తాజా కథనాలు