అండర్ గ్రౌండ్ మెట్రో ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. ఎక్కడంటే ?
మహారాష్ట్ర రాజధాని ముంబైలో శనివారం అండర్ గ్రౌండ్ మెట్రో పరుగులు తీయనుంది. ప్రధాని మోదీ మహారాష్ట్రలో ముంబై మెట్రో లైన్-3తో పాటు మొదటి భూగర్భ మెట్రో లైన్‌ను ప్రారంభించనున్నారు.
మహారాష్ట్ర రాజధాని ముంబైలో శనివారం అండర్ గ్రౌండ్ మెట్రో పరుగులు తీయనుంది. ప్రధాని మోదీ మహారాష్ట్రలో ముంబై మెట్రో లైన్-3తో పాటు మొదటి భూగర్భ మెట్రో లైన్‌ను ప్రారంభించనున్నారు.
దేశ వాణిజ్య రాజధాని ముంబైకి ఉగ్రముప్పు పొంచి ఉన్నట్లు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. ముంబై వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.
మధ్యప్రదేశ్‌లోని జబల్పుర్ నుంచి ముంబయికి వెళ్తున్న రైలులో ఒక్కసారిగా పాము ప్రత్యక్షమయ్యింది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రైల్వే అధికారులకు సమాచారం అందిచగా వాళ్లు పామును పట్టుకొని బయట వదిలేశారు.
ముంబయి విమానాశ్రయం నుంచి బయల్దేరిన ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో తిరువనంతపురం విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో హై అలెర్ట్ ను ప్రకటించారు.
ముంబై అటల్‌సేతు బ్రిడ్జిపై నుంచి ఓ మహిళ సముద్రంలో దూకుతుండగా క్యాబ్ డ్రైవర్ అసాధారణ రీతిలో రక్షించాడు. చివరి క్షణంలో ఆమె జుట్టుపట్టుకుని పోలీసుల సాయంతో పైకి లాగాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. క్యాబ్ డ్రైవర్, పోలీసులపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
మహారాష్ట్రను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా ముంబయ్‌లో వానలు దంచికొడుతున్నాయి. దీంతో వాతావరణశాఖ ముంబయ్‌కు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు ఇళ్ళల్లోనే ఉండాలని బయటకు రావొద్దని పోలీసులు కీలక సూచనలు చేశారు.
మహారాష్ట్ర, గుజరాత్, గోవా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వాన ముంబై నగరాన్ని ముంచెత్తుతోంది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలు, ఉద్యోగులకు రెండు రోజులు సెలవును ప్రకటించింది.
ముంబయ్ తీరంలో నిలిపిన ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో యుద్ధనౌక తీవ్రంగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో నావికుడు కూడా గల్లంతయ్యారు.