అండర్‌ గ్రౌండ్‌ మెట్రో ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. ఎక్కడంటే ?

మహారాష్ట్ర రాజధాని ముంబైలో శనివారం అండర్‌ గ్రౌండ్ మెట్రో పరుగులు తీయనుంది. ప్రధాని మోదీ మహారాష్ట్రలో ముంబై మెట్రో లైన్‌-3తో పాటు మొదటి భూగర్భ మెట్రో లైన్‌ను ప్రారంభించనున్నారు.

New Update
underground metro

PM Modi : మహారాష్ట్ర రాజధాని ముంబైలో శనివారం అండర్‌ గ్రౌండ్ మెట్రో పరుగులు తీయనుంది. ప్రధాని మోదీ మహారాష్ట్రలో ముంబై మెట్రో లైన్‌-3తో పాటు మొదటి భూగర్భ మెట్రో లైన్‌ను ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్స కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులు పాల్గొననున్నారు. అయితే ప్రధాని మోదీ.. అండర్‌ గ్రౌండ్ మెట్రో ప్రయాణంలో లాడ్లీ బహిన్ లబ్ధిదారులు, విద్యార్థులు, కార్మికులతో సంభాషించనున్నారు. 

Also Read: రైతులకు గుడ్‌న్యూస్‌.. ఈరోజే రూ.2 వేలు జమ

Underground Metro

ఆధునిక ఫీచర్లతో ప్రయాణ అనుభవాన్ని మెరుగపరిచేందుకు రూపొందించిన మొబైల్ యాప్ మెట్రో కనెక్ట్-3 ని కూడా ప్రధాని శనివారం ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఎంఎంఆర్‌సీ మేనేజింగ్ డైరెక్టర్ అశ్విని భిడే మాట్లాడారు. ఈరోజు ముంబయి ప్రజలకు ఎంతో ముఖ్యమైన రోజని.. మెట్రోలో ప్రయాణించేవారికి ఈ కొత్త మెట్రో ప్రత్యేక అనుభూతినిస్తుందని తెలిపారు. ఈ భూగర్భ మెట్రో నగర రూపురేఖలను మార్చనుందని పేర్కొన్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు