ఘోర ప్రమాదం.. షార్ట్‌ సర్క్యూట్‌తో కుటుంబం సజీవదహనం!

ముంబై చెంబూర్‌ ప్రాంతంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఏడుగురు కుటుంబసభ్యులు సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులున్నారు. ప్రమాదం జరిగినప్పుడు వారంతా గాఢనిద్రలో ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. 

New Update
AP: దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను భార్య ఏం చేసిందంటే?

Fire Accident: ముంబైలో ఘోర విషాదం చోటుచేసుకుంది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఇంట్లో మంటలు చెలరేగి ఏడుగురు కుటుంబ సభ్యులు సజీవ దహనమైన ఘటన సంచలనం రేపింది. మృతుల్లో ఇద్దరు చిన్నారులుండగా ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.  

అక్కడికక్కడే ఏడుగురు మృతి..

ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెంబూర్‌ ప్రాంతంలో ఓ ఇంట్లో ఆదివారం తెల్లవారుజామున షార్ట్‌ సర్క్యూట్‌ అయింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడికక్కడే ఏడుగురు మృతి చెందారు. బాధితుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. మంటలంటుకున్న సమయంలో కుటుంబం మొత్తం నిద్రలో ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేశారు. అయితే బాధితులను రాజావాడి ఆసుపత్రికి తీసుకెళ్లేలోపు అప్పటికే చనిపోయినట్లు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు