యువకుడిని కొట్టి చంపిన గ్యాంగ్.. భార్యకు గర్భస్రావం (వీడియో)

ముంబైలో కుటుంబం ముందే యువకుడిని ఓ గ్యాంగ్ కొట్టి చంపింది. అడ్డొచ్చిన భార్యను కొట్టగా గర్భస్రావం అయింది. తండ్రికి కూడా గాయాలయ్యాయి. ఈ దాడిలో ఆ యువకుడు తీవ్రగాయాలతో హాస్పిటల్‌లో మృతి చెందాడు. ఇదంతా కేవలం ఓవర్‌టేక్ చేసాడనే కారణంతోనే జరిగినట్లు తెలుస్తోంది.

New Update
mumbai,

కుటుంబం ముందే యువకుడిని ఓ గ్యాంగ్ కొట్టి చంపింది. అంతేకాకుండా అడ్డొచ్చిన భార్యకు సైతం గాయాలు కాగా.. గర్భస్రావం అయింది. అదే సమయంలో గొడవను ఆపుతున్న తండ్రికి కూడా కంటికి గాయం అయినట్లు తెలుస్తుంది. ఈ దాడిలో ఆ యువకుడు తీవ్రగాయాలతో మృతి చెందాడు. ఇదంతా కేవలం బైక్‌ను ఓవర్‌టేక్ చేసాడనే కారణంతోనే జరిగినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే..   

ఇది కూడా చదవండి: ఏపీలో ఆ నగర వాసులకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. సీఎం కృతజ్ఞతలు

గొడవ ఎలా మొదలైంది

ఆకాష్ అనే యువకుడు మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) సభ్యుడు. అతడు ముంబైలోని గోరేగావ్ ప్రాంతంలో ఓవర్‌టేస్ చేసే విషయంలో జరిగిన ఘర్షణలో కొట్టి చంపబడ్డాడు. అందిన సమచారం ప్రకారం.. ఆకాష్ ఓవర్‌టేక్ విషయంలో ఆటోరిక్షా డ్రైవర్లతో గొడవ పడ్డాడు. ఆ వివాదం ముదరడంతో ఓ గ్యాంగ్ మొత్తం ఆ యువకుడిపై దాడి చేసింది. దాదాపు 12 నుంచి 15 మంది ఆకాష్‌పై దాడి చేశారు. ఆ దాడి సమయంలో ఆకాష్‌ భార్య కాపాడేందుకు వెళ్లగా.. గ్యాంగ్ ఆమెను కూడా కొట్టారు. దీంతో ఆకాష్ భార్యకు తీవ్ర గర్భస్రావం జరిగింది. 

ఇది కూడా చదవండి: ఐఫోన్ 13, 14, 15లపై ఆఫర్ల జాతర.. ఇప్పుడు మిస్ అవ్వొద్దు!

అదే సమయంలో ఆకాష్ తండ్రి కూడా అక్కడే ఉండి.. ఆకాష్‌ను కాపాడే ప్రయత్నం చేశాడు. దీంతో అతడికి కూడా కంటికి తీవ్ర గాయాలయ్యాయి. ఆకాష్‌ను దారుణంగా కొట్టడంతో పరిస్థితి విషమించింది. గమనించిన ఆ గ్యాంగ్ అక్కడి నుంచి పారిపోయింది. ఆపై ఆకాష్‌ను హాస్పిటల్‌ తరలించగా అతడు అక్కడ మృతి చెందాడు. ప్రస్తుతం ఆ గ్యాంగ్ దాడి చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

వీడియోలో ఏముంది..

ఇది కూడా చదవండి: RGV డెన్ లో 'యానిమల్' డైరెక్టర్.. ఏం ప్లాన్ చేస్తున్నారో?

ఓ గ్యాంగ్ యువకుడిని దారుణంగా కొట్టినట్లు వీడియోలో కనిపిస్తుంది. అదే సమయంలో ఓ వృద్ధుడు వారిని ఆపుతుండగా అతడిని కూడా దారుణంగా కొట్టినట్లు చూడొచ్చు. అలాగే ఒక మహిళ సైతం ఆ యువకుడిపై పడుకుని దెబ్బలు తగలకుండా ఆపుతుంది. కాగా ఆ యువకుడిని దారుణంగా తన్నడంతో పాటు పిడిగుద్దులు కుపించారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఇది చూసి చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కడిని చేసి ఇంతమంది కొట్టి చంపడం చాలా బాధాకరమైన విషయమని చెప్తున్నారు. 

నిందితులు అరెస్ట్..

ఇది కూడా చదవండి: ఎంబీబీఎస్ అడ్మిషన్ వివాదం .. సుప్రీంకోర్టు కీలక తీర్పు

ఈ దాడిలో ఆకాష్ మృతి చెందాడు. ఈ ఘటన విషయంలో ముంబైలోని దిండోషి పోలీసులు హత్య కేసు నమోదు చేసి 9 మందిని అరెస్ట్ చేశారు. నిందితులందరినీ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారందరినీ అక్టోబర్ 22 వరకు పోలీస్ కస్టడీకి పంపింది. అయితే పోలీసుల సమాచారం ప్రకారం.. ఈ ఘటన అక్టోబర్ 12న జరిగినట్లు తెలుస్తోంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు