Mpox: భారత్లో రెండో మంకీపాక్స్ కేసు నమోదు..!
భారతదేశంలో రెండో మంకీపాక్స్ కేసు నమోదైంది. కేరళలోని మలప్రమ్లో 38 ఏళ్ల వ్యక్తి ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి వచ్చిన అతనికి చికిత్స అందిస్తున్నట్లు హెల్త్ మినిస్టర్ వీణా జార్జ్ తెలిపారు.