Mpox: భారత్‌లో మంకీ పాక్స్‌ క్లాడ్‌ 1 బీ తొలి కేసు... !

భారత్‌ లో మంకీ పాక్స్‌ మరో కేసు నమోదైంది. ఈ సారి నమోదైన కేసు ‘హెల్త్ ఎమర్జెన్సీ’కి కారణమైన ‘క్లాడ్‌ 1బీ’ రకం కావడం ఆందోళన కలిగిస్తుంది. కేరళకు చెందిన 38 ఏళ్ల యువకుడిలో క్లాడ్‌ 1బీ రకం మంకీపాక్స్ వ్యాధి నిర్థారణ అయ్యింది.

New Update
Monkey Pox : డేంజర్ బెల్స్.. పాకిస్తాన్ లో ఐదో మంకీ పాక్స్ రోగి

Mpox: భారత్‌ లో మంకీ పాక్స్‌ మరో కేసు నమోదైంది. ఈ సారి నమోదైన కేసు ‘హెల్త్ ఎమర్జెన్సీ’కి కారణమైన ‘క్లాడ్‌ 1బీ’  రకం కావడం ఆందోళన కలిగిస్తుంది. ఈ రకం మంకీపాక్స్‌ ఆఫ్రికాను అతలాకుతలం చేసింది. కేరళకు చెందిన 38 ఏళ్ల యువకుడిలో క్లాడ్‌ 1బీ రకం మంకీపాక్స్ వ్యాధి నిర్థారణ అయినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. 

కేరళలోని మలప్పురానికి చెందిన ఈ వ్యక్తి ఇటీవలే యూఏఈ నుంచి అతని స్వస్థలానికి వచ్చాడు. అతడిలో  మంకీపాక్స్‌ లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు నిర్వహించగా క్లాడ్‌ 1గా రిపోర్టుల్లో తేలింది. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నట్లు కేంద్రం తెలిపింది. దేశంలో మంకీపాక్స్‌‌కు సంబంధించిన తొలి కేసు సెప్టెంబర్‌ 9న నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ మొత్తం 30 ఎంపాక్స్ కేసులు నమోదయ్యాయి. 

అయితే, ఇవన్నీ క్లాడ్ 2 రకానికి చెందినవి. దానితీవ్రత తక్కువగా ఉంటుంది. పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. తాజాగా నమోదైన క్లాడ్ 1బీ రకం మంకీపాక్స్ రకం వ్యాధికి వ్యాప్తి చెందే గుణం ఎన్నో రేట్లు ఎక్కువగా ఉంది.మంకీ పాక్స్‌ అనేది ఒక వైరల్ వ్యాధి. ఇది మనిషి నుంచి మనుషులకు, జంతువుల నుంచి మనుషులకు సోకే ప్రమాదం ఉన్న వ్యాధి. ఈ వ్యాధి వివిధ దేశాల్లో వ్యాప్తి చెందుతున్న కారణంగా దీనిని ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘ఆరోగ్య అత్యవసర స్థితి’  సమస్యగా ప్రకటించింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు