Mpox: భారత్‌లో రెండో మంకీపాక్స్ కేసు నమోదు..! భారతదేశంలో రెండో మంకీపాక్స్ కేసు నమోదైంది. కేరళలోని మలప్రమ్‌లో 38 ఏళ్ల వ్యక్తి ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి వచ్చిన అతనికి చికిత్స అందిస్తున్నట్లు హెల్త్ మినిస్టర్ వీణా జార్జ్ తెలిపారు. By srinivas 18 Sep 2024 in లైఫ్ స్టైల్ Short News New Update షేర్ చేయండి Mpox: భారతదేశంలో రెండో మంకీపాక్స్ కేసు నమోదైంది. కేరళలోని మలప్రమ్‌లో 38 ఏళ్ల వ్యక్తి ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి వచ్చిన అతనికి చికిత్స అందిస్తున్నట్లు హెల్త్ మినిస్టర్ వీణా జార్జ్ తెలిపారు. ప్రోటోకాల్‌లకు అనుగుణంగా చికిత్స అందిస్తున్నాం..రోగిని ఒంటరిగా ఉంచి, ఏర్పాటు చేసిన మెడికల్ ప్రోటోకాల్‌లకు అనుగుణంగా చికిత్స అందిస్తున్నట్లు మంత్రి వీణా తెలిపారు. ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వ్యక్తికి వ్యాధి లక్షణాలు కనిపించాయి. అస్వస్థతకు గురికావడంతో తొలుత ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి, తర్వాత మంజేరి మెడికల్ కాలేజీకి తరలించాం. అతని నమూనాలను పరీక్షల కోసం కోజికోడ్ మెడికల్ కాలేజీకి పంపగా పాజిటీవ్ వచ్చిందని చెప్పారు. అతను ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాడు. వైద్యుల సంరక్షణ పొందుతున్నాడు. విదేశాల నుంచి వచ్చే ప్రజలు తమ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ మంత్రి బహిరంగ ప్రకటన విడుదల చేశారు. లక్షణాలను కనిపిస్తే వెంటనే వైద్యులను కలవండి..ఎవరికైనా మంకీపాక్స్ లాంటి లక్షణాలను కనిపిస్తే వెంటనే వైద్యులను కలవండి. వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి ముందస్తు రోగ నిర్ధారణ, చికిత్స చాలా కీలకం.రాష్ట్ర ఆరోగ్య శాఖ కేరళలోని వివిధ ఆసుపత్రులలో చికిత్స, ఐసోలేషన్ సౌకర్యాలను ఏర్పాటు చేసింది. మీకు సహాయం చేయడానికి నోడల్ అధికారులు అందుబాటులో ఉన్నారు. రాష్ట్రంలోని వైద్య కళాశాలలు కూడా అవసరమైన వారికి సేవలందించేలా చికిత్స కేంద్రాలుగా నియమించబడ్డాయని మంత్రి తెలిపారు. #mpox #kerala మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి