జిమ్‌లో కసరత్తులు, ఈ వయసులోనూ తగ్గేదేలేదంటున్న హీరో మోహన్‌లాల్ మళయాల హీరో మోహన్‌లాల్ టాలీవుడ్‌లో ఎన్టీఆర్ నటించిన జనతాగ్యారేజీ సినిమాలో నటించి అందరిని అబ్బురపరిచాడు. ప్రస్తుతం తన వయస్సు 63 ఏళ్లు. అయితేనేం ఏజ్ తన బాడీకే కానీ తన మనసుకు కాదంటూ ఈ వయసులోనూ తగ్గేదేలే అంటూ కుర్రాళ్లకు సవాల్ విసురుతున్నాడు.ఏకంగా 100 కిలోల బరువును ఎత్తి ఫ్యాన్స్‌ని విస్మయానికి గురిచేశాడు.ప్రస్తుతం తాను జిమ్‌లో చేసిన కసరత్తులకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఫిట్‌నెస్‌పై అతనికి ఉన్న డెడికేషన్‌కి అందరూ షాక్ అవుతున్నారు. By Shareef Pasha 27 Jul 2023 in సినిమా Scrolling New Update షేర్ చేయండి హీరో మోహన్‌లాల్ తన ఫిట్‌నెస్ సంబంధించిన వీడియోను షేర్ చేసుకున్నారు.అసాధారణమైన శరీరాకృతికి కేరాఫ్ అడ్రస్‌గా పేరుగాంచిన ప్రముఖ నటుడు మోహన్‌లాల్ జిమ్‌లో 100 కిలోల బరువును ఏకదాటిగా ఎత్తడంతో ఫ్యాన్స్ షాకయ్యారు.అంతేకాదు తన బాడీ ఫిట్‌నెస్‌పై తన శరీరాకృతిని మెయింటైన్ చేస్తూ చాలా మందికి ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తున్నాడు.సార్ మీ వయస్సు 63 ఏళ్లా అంటూ అభిమానులు ప్రశ్నించారు.ఫిట్‌నెస్ పట్ల ఆయనకున్న అంకితభావం చాలా మందికి స్ఫూర్తినిచ్చాయి.సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో జిమ్‌లో 100 కిలోల బరువును అప్రయత్నంగా ఎత్తడం మీరు గమనించవచ్చు. 100 కేజీల బరువును ఎత్తిన మోహన్‌లాల్ View this post on Instagram A post shared by Mohanlal (@mohanlal) మోహన్‌లాల్ పుల్ ఫ్యాన్స్‌ని కలిగి ఉన్నప్పటికి అతను కొన్ని ఫిట్‌నెస్ ప్రేరణ కోసం కూడా చాలామంది చూస్తున్నారు.'లూసిఫర్' నటుడు ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్లి జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న స్ఫూర్తిదాయకమైన వీడియోను వదులుకున్నాడు.నటుడు 100 కిలోల బరువును చాలా తేలికగా ఎత్తడం కనిపించింది. అయితే అతని పక్కన తన పక్కన జిమ్ ట్రైనర్ జాగ్రత్తలు తీసుకొని అమాంతం ఎత్తేశాడు. ఫ్యాన్స్ ఎలా స్పందించారంటే? మోహన్‌లాల్ అద్భుతంగా ప్రదర్శించిన బలాన్ని చూసి అభిమానులు ఈ వ్యక్తికి నిజంగా 63 ఏళ్లు ఉన్నాయా? అంటూ ఖంగుతిన్నారు. అంతేకాదు ఫిట్‌నెస్ విషయంలో మోహన్‌లాల్‌కు ఉన్న డెడికేషన్‌కి ఫిదా అవుతున్నారు. అంతటి వయస్సులో అంతటి దృఢమైన బాడీ ఫిట్‌నెస్‌ని ఎలా కొనసాగించడంపై ఎంతోమంది యువతకు ఇన్‌స్పిరేషన్ అనే చెప్పాలి.ఇక యువత ఇలాంటి కఠినతర ఫిట్స్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. #video-viral #movies #gym #mohanlal మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి