Mohanlal : మోహన్‌లాల్‌కు మరో అరుదైన గౌరవం

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. న్యూఢిల్లీలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ప్రశంసా పత్రాన్ని అందజేశారు. గౌరవ లెఫ్టినెంట్ కల్నల్‌గా టెరిటోరియల్ ఆర్మీలో ఉన్న మోహన్‌లాల్, ఈ గుర్తింపు పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

New Update
mohanlal

ఎంతో గౌరవంగా ఉంది

ఈ సందర్భంగా మోహన్‌లాల్ మాట్లాడుతూ, "ఆర్మీ చీఫ్ నుండి ఈ గుర్తింపు అందుకోవడం ఎంతో గౌరవంగా ఉంది. గౌరవ లెఫ్టినెంట్ కల్నల్‌గా ఈ గుర్తింపు పొందడం నాకు ఎంతో గర్వకారణం, కృతజ్ఞతాభావం కలిగిన క్షణం. జనరల్ ఉపేంద్ర ద్వివేదికి మొత్తం ఇండియన్ ఆర్మీకి, నా పేరెంట్ యూనిట్ అయిన టెరిటోరియల్ ఆర్మీకి ఈ గౌరవానికి, వారి నిరంతర మద్దతుకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడిని" అని తెలిపారు.

ఆర్మీ చీఫ్‌తో జరిగిన సమావేశంలో, టెరిటోరియల్ ఆర్మీ బెటాలియన్ల సామర్థ్యాన్ని మెరుగుపరచడం, దేశం కోసం చేయగలిగే పనుల గురించి కూడా చర్చించినట్లు మోహన్‌లాల్ వెల్లడించారు. ఇది ఆర్మీలో గత 16 సంవత్సరాలుగా భాగమైన తనకి లభించిన ఒక గొప్ప గౌరవంగా అభివర్ణించారు. ఇటీవల మోహన్‌లాల్‌కి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా లభించిన సంగతి తెలిసిందే. 

Advertisment
తాజా కథనాలు