/rtv/media/media_files/2025/09/23/mohanlal-dada-saheb-phalke-award-2025-09-23-17-58-34.jpg)
mohanlal Dada Saheb Phalke Award
Mohanlal Dadasaheb Phalke Award: మలయాళ సూపర్ స్టార్ మోహనల్ ఈరోజు ఢిల్లీ వేదికగా జరిగిన 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో ప్రతిష్టాత్మక 'దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు'ను అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయనకు అవార్డు ప్రధానం జరిగింది. 2023 సంవత్సరానికి గానూ భారత ప్రభుత్వం మోహన్ లాల్ కు 'దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు'ను ప్రకటించింది. భారతీయ సినిమాకు ఆయన చేసిన కృషి, ఆయన ప్రతిభ, బహుముఖ నైపుణ్యానికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందించారు. భారతీయ సినిమా పితామహుడు ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే పేరు మీదుగా దాదాసాహెబ్ పురస్కారాన్ని ఇస్తారు.
మోహన్ లాల్ కు అవార్డు ప్రధానం జరిగేటప్పుడు స్టేడియం అంతా స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. చప్పట్లు, హర్ష ధ్వనులతో ఆనందం వ్యక్తం చేశారు. అవార్డు అందుకున్న సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు మోహన్ లాల్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
മലയാളത്തിന്റെ സ്വന്തം മോഹൻലാൽ...! ❤️🥹
— Ananthajith Asokkumar 🇮🇳 (@iamananthajith) September 23, 2025
Mohanlal Called as Lalettan in the Dada Saheb Phalke Award Ceremony…!
Pride Moment For All Malayalis Across the World…! @Mohanlal#Mohanlalpic.twitter.com/V7v1n11UTW
మళయాళంతో పాటు తమిళ్, హిందీ, కన్నడ భాషల్లోనూ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మోహన్ లాల్. 65 ఏళ్ల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీగా వరుస సినిమాలు చేస్తున్నారు. సినిమాలు చేయడం మాత్రమే కాదు బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా సినీ కెరీర్ లో మలయాళంతో పాటు తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో దాదాపు 350కి పైగా సినిమాల్లో నటించారు. తనమత్ర', 'దృశ్యం', 'వనప్రస్థం', 'ముంతిరివల్లికల్ తలిర్క్కుంబోల్', 'పులిమురుగన్' వంటి సినిమాలతో విమర్శకుల ప్రశంసలు పొందారు.
ఆరు నేషనల్ అవార్డ్స్
ఇప్పటికే మోహన్ లాల్ ఆరు జాతీయ చలన చిత్ర అవార్డులు, పది కేరళ రాష్ట్ర పురస్కారాలు, ఒక నంది అవార్డు ఇతర అంతర్జాతీయ గౌరవాలను అందుకున్నారు.
పద్మశ్రీ, పద్మభూషణ్
అలాగే కళారంగంలో చేసిన సేవలకు గాను 2001లో పద్మశ్రీ, 2019లో పద్మభూషణ్ పురస్కారాలతో భారత ప్రభుత్వం సత్కరించింది. ఇప్పుడు 'దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు' తో ఆయన ఖాతాలో మరో ఘనత చేరింది.
ఇదిలా ఉంటే మోహన్ లాల్ రీసెంట్ గా ఎల్ 2 ఎంపురాన్, తుడురామ్ చిత్రాలతో బ్యాక్ బ్యాక్ విజయాలను అందుకున్నారు. ఇటీవలే విడుదలైన 'హృదయపూర్వం' సినిమా కూడా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. భా. భా. బ, వృషభ, దృశ్యం 3, పేట్రియాట్, రామ్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. వీటిలో 'వృషభ' మూవీ చిత్రీకరణ ఇప్పటికే పూర్తవగా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. మిగతా చిత్రాలు చిత్రీకరణలో బిజీగా ఉన్నాయి.
Also Read: Bigg Boss Promo: రీతూ దెబ్బకు డెమోన్ పవన్ అవుట్! లవ్ బర్డ్స్ కి షాకిచ్చిన బిగ్ బాస్