Nandamuri Vasundhara Devi: ఎమ్మెల్యే బాలకృష్ణ (Balakrishna) హ్యాట్రిక్ విజయం సాధించిన తర్వాత మొదటిసారిగా హిందూపురం వచ్చారు ఆయన సతీమణి వసుంధర దేవి. శ్రీ సత్య సాయి జిల్లా చిలమత్తూరు మండలం దేమకేతేపల్లిలో ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందజేసారు. ఎన్టీఆర్, చంద్రబాబు, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ల చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన వసుంధర దేవి.. హ్యాట్రిక్ విజయం అందించినందుకు హిందూపురం ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
Also Read: ఏదైనా సమస్య వస్తే ఇలా చేయండి: ఎమ్మెల్యే విజయలక్ష్మి
ప్రజలు హ్యాట్రిక్ విజయం అందించినందుకు తమపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని మరోసారి భరోసా ఇచ్చారు. పేద ప్రజలు బాగుండాలనే వారి సంక్షేమం కోసం ఎన్నికల్లో హామీలు ఇచ్చామన్నారు. వయసు మీద పడిన వృద్ధులు హాయిగా ఉండాలనే లక్ష్యంతోనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ప్రకటించడం జరిగిందని అన్నారు.