Mohan Babu: మోహన్ బాబుకు హైకోర్టులో ఊరట!
నటుడు మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. పోలీసుల ముందు విచారణకు న్యాయస్థానం మినహాయింపు ఇచ్చింది. డిసెంబర్ 24కు విచారణను వాయిదా వేసింది. ప్రతి రెండు గంటలకు ఒకసారి మోహన్ బాబు ఇంటిని పరిశీలించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
Manchu Family: మంచు ఫ్యామిలీకి మీడియా అంటే చులకనా? గతంలోనూ చాలాసార్లు
మంచు ఫ్యామిలీ మధ్య తగాదాలు చిలికి చిలికి గాలి వానలాగా మారిపోయాయి. వీళ్ళ కొట్లాట మీడియా ప్రతినిధుల ప్రాణం మీదకి వచ్చింది. ఇంటి దగ్గరకొచ్చిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేశారు. గతంలోనూ మంచు ఫ్యామిలీ మీడియాపై దాడి చేసిన సందర్భాలున్నాయి.
మా నాన్న చేసిన తప్పు అదే.. మంచు విష్ణు సంచలనం!
మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలపై క్లారిటీ ఇచ్చారు మంచు విష్ణు. తాను లేని 4,5 రోజుల్లోనే గొడవలు జరిగిపోయాయన్నారు. నిన్నటి ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడి కాదని వివరణ ఇచ్చారు. మమ్మల్ని విపరీతంగా ప్రేమించడమే మా నాన్న చేసిన తప్పు అని కీలక వ్యాఖ్యలు చేశారు.
BIG BREAKING : మా నాన్న దేవుడు.. మీడియాకి మంచు మనోజ్ క్షమాపణలు
మంచు మనోజ్ తాజాగా మీడియాతో మాట్లాడారు. నిన్న రాత్రి జరిగిన గొడవ గురించి మాట్లాడుతూ..మీడియాకి క్షమాపణ కోరారు. మా అన్న, మా నాన్న తరుపున మీడియా మిత్రులకు క్షమాపణలు చెబుతున్నా. మీడియా మీద దాడి చేయడం బాధ కలిగించిందని అన్నారు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..
Mohan Babu : హాస్పిటల్ లో చేరిన మోహన్ బాబు..!
మోహన్ బాబు హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. హైబీపీ, గుండెలో నొప్పి సమస్యతో ఆయన గచ్చిబౌలిలోనూ కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో మోహన్ బాబు చికిత్స తీసుకుంటున్నారు. మోహన్ బాబుతో పాటు పెద్ద కొడుకు మంచు విష్ణు ఉన్నాడు.
పనిమనిషి ఆత్మహత్యాయత్నం...మంచు"రగడ"లో కీలక మలుపు| Mohan Babu House Maid Suicide Attempt Update | RTV
మోహన్‌బాబు ఇంటి పనిమనిషి ఆత్మాహత్యాయత్నం!
మంచు ఫ్యామిలీ రచ్చలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మోహన్‌బాబు ఇంటి పనిమనిషి ఆత్మాహత్యాయత్నం చేసుకుంది. కెమెరా ఉందని తెలియక మోహన్ బాబు ఇంట్లో జరిగిన రచ్చపై ఆమె సంచలన విషయాలు చెప్పింది. అవి వైరల్ కావడంతో ఒత్తిడికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.