Lebanan: భారత పౌరులు లెబనాన్ ని వదిలి వెళ్లండి!
లెబనాన్ లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రజల ఆందోళన కూడా పెరిగింది. దీంతో బీరూట్ లోని భారత రాయబార కార్యాలయం తదుపరి నోటీసు వచ్చే వరకు లెబనాన్‌కు వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసింది.
లెబనాన్ లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రజల ఆందోళన కూడా పెరిగింది. దీంతో బీరూట్ లోని భారత రాయబార కార్యాలయం తదుపరి నోటీసు వచ్చే వరకు లెబనాన్‌కు వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసింది.
పేజర్లు, వాకీటాకీల పేలుళ్ల వెనుక మొస్సాద్ తో పాటు ఇజ్రాయెల్ కు చెందిన ఓ రహస్య యూనిట్ పని చేసినట్లు తెలుస్తుంది. అదే యూనిట్ 8200. ఇజ్రాయెల్ రహస్య యూనిట్ 8200ను ‘యహిద షమోనే మతాయిమ్’ అని కూడా అంటారు.
ఎలక్ట్రానిక్ పరికరాల మీద దాడ అయిపోయింది ఇప్పుడు ప్రత్యక్ష దాడులతో హెజ్బుల్లా మీద విరుచుకుపడుతోంది ఇజ్రాయెల్. హెజ్బుల్లా ఉగ్ర కార్యకలాపాలు, మౌలిక సదుపాయాల నాశనమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చెప్పింది.
లెబనాన్, సిరియాలో వందల సంఖ్యలో పేజర్లు పేలిన ఘటనలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. దీంతో లెబనాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి తమ దేశం నుంచి వెళ్లే విమానాల్లో పేజర్లు, వాకీటాకీలు తీసుకెళ్లకుండా నిషేధం విధించింది.
లెబనాన్‌లో పేజర్లను పేల్చి విధ్వంసం సృష్టించిన మరుసటి రోజే వాకీటాకీల పేలుళ్లు కలకలం రేపాయి. బుధవారం బీరుట్‌తోపాటు పలు ప్రాంతాల్లో వాకీటాకీలను హ్యాక్ చేసి పేల్చేశారు. ఈ ఘటనల్లో 20మంది మృతిచెందగా.. 450 మంది గాయపడ్డారు.
లెబనాన్ లో పేలుళ్లకు కారణమైన హెజ్బొల్లా పేజర్లను తాము తయారు చేయలేదని గోల్డ్ అపోలో కంపెనీ వెల్లడించింది.ఆ పేజర్లు బుడాపెస్ట్ లోని ఓ కంపెనీలో తయారయ్యాయని తెలిపింది. వాటి పై తమ కంపెనీ పేర్లు వాడటానికి మాత్రమే అనుమతి ఇచ్చామని ఆ ప్రకటనలో చెప్పింది.
నిన్న పేజర్ పేలుళ్ళు...ఇవాళ వాకీ టాకీలు. లెబనాన్లు వరుసగా ఎలక్ట్రానిక్ పరికరాలు పేలుతూనే ఉన్నాయి. అవొక్కటే కాదు కార్ రేడియోలు, ఫోన్లు లాంటవి కూడా పేలుతున్నాయి. ఈ పేలుళ్ళ వల్ల 9మంది చనిపోగా..300మందికి గాయాలయ్యాయి.
హెజ్బొల్లా పేజర్ల పేలుళ్ల వెనుక ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ హస్తం ఉన్నట్లు బలంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వేలాది పేజర్ల లో మిలటరీ గ్రేడ్ పేలుడు పదార్థాలు అమర్చినట్లు సైనిక నిపుణులు చెబుతున్నారు.
లెబనాన్, సిరియాలలో ఒకేసారి వందల పేజర్లు పేలిపోయాయి. ఫలితంగా పదుల సంఖ్యలో ప్రజలు మృతిచెందారు. 2750 మందికి పైగా ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు.గాయపడిన వారిలో లెబనాన్ లోని ఇరాన్ రాయబారితో పాటు హెజ్బొల్లా కీలక నేతలు కూడా ఉన్నారు.