Lebanon: పేలిన రేడియో, వాకీటాకీలు.. 20మంది మృతి, 450మందికి గాయాలు

లెబనాన్‌లో పేజర్లను పేల్చి విధ్వంసం సృష్టించిన మరుసటి రోజే వాకీటాకీల పేలుళ్లు కలకలం రేపాయి. బుధవారం బీరుట్‌తోపాటు పలు ప్రాంతాల్లో వాకీటాకీలను హ్యాక్‌ చేసి పేల్చేశారు. ఈ ఘటనల్లో 20మంది మృతిచెందగా.. 450 మంది గాయపడ్డారు.

author-image
By V.J Reddy
New Update
Walkie Talkies Blast

Lebanon : లెబనాన్‌లోని హిజ్బుల్లాలో బుధవారం జరిగిన రెండవ పేలుళ్లలో 20 మంది మరణించగా.. దాదాపు 450 మంది గాయపడ్డారు. హిజ్బుల్లా సభ్యులకు చెందిన వాకీ టాకీలు బీరూట్, బెకా వ్యాలీ, దక్షిణ లెబనాన్ అనే మూడు ప్రాంతాలలో పేలినట్లు లెబనీస్ మీడియా నివేదించింది . బెకా లోయలోని సోహ్మోర్ పట్టణంలో పేర్కొనబడని పరికరాలు పేలి ముగ్గురు వ్యక్తులు మరణించారని నేషనల్ న్యూస్ ఏజెన్సీ నివేదించింది. పలు ప్రాంతాల్లోని ఇళ్లలో సోలార్ ఎనర్జీ సిస్టమ్స్ పేలి ఒక బాలిక గాయపడినట్లు పేర్కొంది. లెబనాన్ అంతటా ఉన్న ప్రదేశాలలో ఇంటర్‌కామ్‌లు, రేడియోలు కూడా పేలినట్లు అల్ జజీరా రిపోర్ట్ చేసింది. 

వందల మంది మృతి..

బీరుట్‌లో బుధవారం జరిగిన మృతుల అంత్యక్రియల కార్యక్రమంలో వందల మంది హాజరయ్యారు. ఇదే మంచి సమయం గా భావించిన దుండగులు వారి వద్ద ఉన్న వాకీటాకీలను పేల్చేశారు. మరోవైపు తీర ప్రాంతంలోని సిడోన్‌లో కారుతోపాటు ఒక దుకాణంలో పేలుళ్లు సంభవించాయి. బీరుట్‌లోని పలు ఇళ్లలో సౌర పరికరాలూ పేలిపోయాయి. హెజ్‌బొల్లా గ్రూపునకు చెందిన వారి చేతుల్లో ఉండే రేడియో లాంటి పరికరాలు కూడా పేలినట్లు పలు కథనాలు పేర్కొన్నాయి.

కాగా లెబనాన్‌ (Lebanon) లో పేలిన వాకీటాకీలు జపాన్‌లో తాయారు చేయబడినట్లు అక్కడి అధికారులు గుర్తించారు. వాటిపై ఐకామ్‌ అని ముద్రించి ఉంది. ఐకామ్‌ అనేది రేడియో కమ్యూనికేషన్స్, టెలిఫోన్ల కంపెనీ. అయితే లెబనాన్‌లో పేలిన వాకీ టాకీల ఉత్పత్తిని ఎప్పుడో ఆపేశామని ఐకామ్‌ స్పష్టం చేసింది. చేతుల్లో ఇమిడిపోయే రేడియో కమ్యూనికేషన్ల పరికరాలను హెజ్‌బొల్లా 5 నెలల కిందట కొనుగోలుచేసినట్లు తెలుస్తోంది.

కాగా మంగళవారం జరిగిన దాడుల్లో 12 మంది మరణించారు. దాదాపు 2800 మంది గాయపడినట్లు అక్కడి స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఈ దాడుల్లో లెబనాన్ అంతటా హిజ్బుల్లా సభ్యులకు చెందిన వేలాది పేజర్లు పేలాయి. కాగా ఈ దాడుల వెనుక ఇజ్రాయిల్ ఉందని అక్కడి నాయకులూ ఆరోపణలు చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు