ఫుల్ ఫోర్స్‌తో హెజ్బుల్లా మీద దాడి చేయండి..సైన్యానికి నెతన్యాహు ఆర్డర్

ఎవరేం చెప్పినా వినొద్దు...ఫుల్ ఫోర్స్‌తో దాడి చేయండి...హెజ్బుల్లా నాశనమే మన లక్ష్యం మన అంటున్నారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.  కాల్పుల విరమణ పాటించాలని అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ దేశాలు ఇచ్చిన పిలుపును ఆయన పక్కన పెట్టేశారు. 

New Update
attacks

Israel Attacks: 

లెబనాన్ మీద ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. హిజ్బుల్లా, వారి స్థావరాలే లక్ష్యంగా వరుసగా దాడులు చేస్తోంది. దక్షిణ లెబనాన్‌లో బీరుట్ ఇంకా మిగతా ప్రాంతాల్లో  ఇప్పటికే 2వేల హిజ్బుల్లా స్థావరాల మీద అటాక్ చేసింది ఇజ్రాయెల్ సైన్యం. దీని వలన కేవలం 5 రోజుల్లో 90 వేల మంది నిరాశ్రయులు అయ్యారని కూడా వార్తా కథనాలు వచ్చాయి.  మరోవైప 600 మంది చనిపోయారు...5 లక్షల మంది నిరాశ్రయులు అయ్యారు అని కూడా చెబుతున్నారు. ఒకటి మాత్రం కచ్చితం ఏంటంటే..లెననాన్‌లో పరిస్థితి రోజు రోజుకూ దిగాజారుతోంది.  ఇజ్రాయెల్ ఇలానే దాడులు చేస్తూ పోతే కొన్ని రోజులకు హిజ్బుల్లా సంగతి ఏమో కానీ లెబనానే మొత్తం కనిపించకుండా పోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. 

అయితే ఏం జరిగినా తాము మాత్రం తగ్గేదే లేదు అంటున్నారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.  కాల్పుల విరమణ పాటించాలని అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ దేశాలు పిలుపునిచ్చాయి. దీనిపై ఆయన కనీసం స్పందిచను కూడా స్పందిచలేదు. పైగా తన సైన్యానికి ఫుల్ ఫోర్స్‌తో దాడులు చేయమని ఆదేశాలు ఇచ్చారు. మిత్రదేశాలు చెప్పినట్టు 21 రోజులు కాల్పుల విరమణ చేస్తే హిజ్బుల్లా కోలుకునేందుకు అవకాశం ఇచ్చినట్టు అవుతుందని చెప్పారు ఇజ్రాయెల్ రెవెన్యూశాఖ మంత్రి స్మోట్రిచ్. 

ఇక మరోవైపు లెబనాన్ మీద భూతల దాడులకు సిద్ధం అవుతోంది ఇజ్రాయెల్. దక్షిణ లెబనాన్‌లో పౌరుల ఇళ్ళల్లో హెజ్‌బొల్లా తమ ఆయుధాలను దాచి పెట్టిందని ఇజ్రాయెల్‌ ఆరోపిస్తోంది. 20 ఏళ్లుగా లెబనాన్‌లో హెజ్‌బొల్లా తన నెట్‌వర్క్‌ను భారీగా విస్తరించుకుందని..ముఖ్యంగా దక్షిణ లెబనాన్‌ వారికి ఆయుధాల అడ్డాగా మారిందని అంటోంది. ఇజ్రాయెల్‌పై దాడి చేసేందుకు ఆ ప్రాంతాన్ని వారు లాంచ్‌ ప్యాడ్‌లా మలుచుకున్నారు. అందుకే అక్కడ దాడులకు పాల్పడుతున్నామని తెలిపింది. అయితే తాము స్థానికులకు ఎటువంటి ఇబ్బందులు కలిగించడం లేదని...మేము ముందే పక్కాగా రెక్కీచేసి కేవలం హెజ్బుల్లా స్థావరాల మీదనే అటాక్ చేస్తున్నామని ఐడీఎప్ చెబుతోంది. ఇప్పటికే వందలాది స్థావరాలను ధ్వంసం చేశామని.. ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా దాడిని అడ్డుకోవడమే మా లక్ష్యం అని తెలిపింది.  తమ అటాక్స్ కు సంబంధించిన వీడియోలను కూడా విడుదల చేసింది.  

 

Also Read: Wage Rates : కనీస వేతనాలు నెలకు 26,910 రూ.లకు పెంచిన కేంద్రం

Advertisment
Advertisment
తాజా కథనాలు