కనుబొమ్మలు అందంగా ఉండాలంటే?
కనుబొమ్మలు అందంగా ఉండాలంటే వాటికి ఆముదం, మెంతుల పేస్ట్, ఉల్లి, నిమ్మ రసం, కొబ్బరి నూనె, పాలు అప్లై చేయాలని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్
కనుబొమ్మలు అందంగా ఉండాలంటే వాటికి ఆముదం, మెంతుల పేస్ట్, ఉల్లి, నిమ్మ రసం, కొబ్బరి నూనె, పాలు అప్లై చేయాలని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్
అలోవెరా జెల్‌ను డైరెక్ట్‌గా చర్మానికి అప్లై చేస్తే అలెర్జీ సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందులోని ఎంజైమ్‌లు కొందరి చర్మానికి దురద, చికాకు, మంటను కలిగిస్తాయి. కాబట్టి డైరెక్ట్‌గా చర్మానికి కలబంద జెల్‌ను అప్లై చేయకపోవడం మంచిది.
భార్య వేధింపులు భరించలేక భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన ఢిల్లీలో జరిగింది. న్యాయవాది సమీర్ మెహెందిర్తాకి తన భార్యకి విడాకుల కోసం గొడవ జరిగింది. దానికి కొంత సమయానికే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
జాన్వీ కపూర్, శిఖర్ పహారియా కొత్త సంవత్సరం నాడు తిరుమల వెంకన్న స్వామిని దర్శించుకున్న విషయం తెలిసిందే. వీరితో పాటు శిఖర్ తల్లి కూడా ఉండటంతో.. వీరు త్వరలో నిశ్చితార్థం చేసుకోబోతున్నారని వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలను జాన్వీ టీమ్ కొట్టిపారేసింది.
ఏపీలో ఘరానా మోసం జరిగింది. నెల్లూరు జిల్లాలోని 'ఆర్ఆర్ ట్రేడర్స్ & ఆర్డర్స్ సప్లయర్స్' గృహ అవసర వస్తువులపై భారీ డిస్కౌంట్ ఇస్తామంటూ జనాలనుంచి కోటి రూపాయలు వసూల్ చేసి రాత్రికిరాత్రే పారిపోయారు. బాధితులు వారి దుకాణాల వద్ద ఆందోళనకు దిగారు.
ఏపీలో పందెం రాయుళ్లు రెచ్చిపోతున్నారు. పందేలు నిర్వహించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పినప్పటికీ గుట్టు చప్పుడు కాకుండా బెట్టింగులు కాస్తున్నారు. ఇప్పటికే తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో దాదాపు రూ.100 కోట్లు చేతులు మారినట్లు తెలుస్తోంది.
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసుపై కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. తన మీద పెట్టిన కేసులో ఏమీలేదని, అంతా లొట్టపీసేనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్యాష్ పిటిషన్ కొట్టివేసినందుకే తనకు ఉరిశిక్ష పడబోతున్నట్లు కాంగ్రెస్ నాయకులు ఫీల్ అవుతున్నారని విమర్శించారు.
నిరుద్యోగులకు భారతీయ రైల్వే భారీ శుభవార్త చెప్పింది. ఐటీఐ అర్హతతో దక్షిణ మధ్య రైల్వేలో 4232 అప్రెంటిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దక్షిణ మధ్య రైల్వేలోకి వచ్చే జిల్లాల అభ్యర్థులు మాత్రమే 2025 జనవరి 27లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
తెలంగాణ రాజకీయాల్లో బాంబులు పేలడం మొదలైందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు ఇవ్వడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పుచేసిన వారు ఎప్పటికీ తప్పించుకోలేరని, ఎప్పటికైనా బయటపడాల్సిందేనన్నారు.