Railway Jobs 2025: నిరుద్యోగులకు భారతీయ రైల్వే భారీ శుభవార్త చెప్పింది. ఐటీఐ అర్హతతో దక్షిణ మధ్య రైల్వేలో 4232 అప్రెంటిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దక్షిణ మధ్య రైల్వేలోకి వచ్చే జిల్లాల అభ్యర్థులు మాత్రమే 2025 జనవరి 27లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. కనీసం 50 శాతం మార్కులతో.. ఈ మేరకు ఉద్యోగ అభ్యర్థులు సికింద్రాబాద్ రైల్వేరిక్రూట్‌మెంట్ సెల్ SCR వర్క్‌షాప్ యూనిట్‌లలో అప్రెంటిస్ శిక్షణలో ప్రవేశాలు పొందాలంటే ఐటీఐ పాసై ఉండాలి. కనీసం 50 శాతం మార్కులతో పది పాస్ కావడంతోపాటు, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత తప్పనిసరి. అభ్యర్థులు ఆన్‌లైన్ వేదికగా అప్లికేషన్ చేసుకోవాలి. ఇక ఉద్యోగాలకు సెలక్ట్ అయిన అభ్యర్థులకు.. సికింద్రాబాద్, లాలాగూడ, మెట్టుగూడ, ఖాజీపేట్, హైదరాబాద్, విజయవాడ, బిట్రగుంట, గూడూరు జంక్షన్, కాకినాడ పోర్టు, కొండపల్లి, మచిలీపట్నం, నర్సాపూర్, ఒంగోలు, రాజమండ్రి, రాయనపాడు, నల్లపాడు, గుంటూరు, గుంతకల్, తిమ్మనచర్ల, యాద్‌గిర్, నాందేడ్, పూర్ణ జంక్షన్, ముద్‌ఖేడ్ ప్రాంతాల్లో ఉద్యోగాలను కేటాయిస్తారు. ఉద్యోగాల డిపార్ట్ మెంట్స్ .. ఏసీ మెకానిక్ - 143, ఎయిర్ కండీషనింగ్ - 32, కార్పెంటర్ - 42, డీజిల్ మెకానిక్ - 142, ఎలక్ట్రికల్ మెకానిక్ - 85, ఇండస్ట్రియల్ ఎలకాట్రనిక్స్ - 10, పెయింటర్ - 74, పవర్ మెయింటెనెన్స్ (ఎలక్ట్రీషియన్) - 34, ఎలక్ట్రీషియన్ - 1053, ఎలక్ట్రికల్(S&T) (ఎలక్ట్రీషియన్) - 10, ఫిట్టర్ - 1742, ట్రైన్ లైటింగ్(ఎలక్ట్రీషియన్) - 34, మెషినిస్ట్ - 100, మోటార్ మెకానిక్ మెహికిల్ - 08, వెల్డర్ - 713, మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ - 10.. ఇలా మొత్తం 4232 పోస్టులున్నాయి. ఇది కూడా చదవండి: Ponguleti: బాంబులు పేలడం స్టార్ట్.. KTR అరెస్ట్‌పై పొంగులేటి సంచలనం! రిజర్వేషన్ ఆధారంగా.. ఎస్సీ-635, ఎసీ-317, ఓబీసీ -1143, ఈడబ్ల్యూఎస్-423, యూఆర్-1714 ఉద్యోగాలు కేటాయిస్తారు. ఇక అభ్యర్థులు 2024 డిసెంబర్ 28 నాటికి 15 నుంచి 24 సంవత్సరాలుండాలి. టెన్త్, ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా సెక్షన్ ఉంటుంది. ఓబీసీలకు మూడు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంది. అప్లికేషన్ చివరి తేది 2025 జనవరి 27. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ scr.indianrailways.gov.in/ సంప్రదించండి. ఇది కూడా చదవండి: Pushpa2: 20 నిమిషాల కొత్త సీన్స్ తో థియేటర్స్ లో 'పుష్ప 2', ఎప్పుడంటే? Also Read : ఆస్కార్ బరిలో అట్టర్ ప్లాప్ సినిమా.. నెట్టింట ట్రోల్స్ Also Read : 'అన్ స్టాపబుల్' లో తారక్ ప్రస్తావన.. స్పందించిన నాగవంశీ