By Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఈసీ తాజా ఆదేశాలు: మొత్తం 3,92,669 మంది ఓటర్లు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తోంది. అక్టోబర్ లో ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా పునః సమీక్ష, మార్పులు- చేర్పులు తదితర అంశాలపై దృష్టి సారించింది.