KTR: కవిత గారు అంటూ.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై కేటీఆర్ సంచలన ట్వీట్ !

ఢిల్లీ లిక్కర్ స్కామ్ సీబీఐ కేసులో మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కోర్టులో ఊరట లభించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కేవలం కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికే ఈ లిక్కర్ స్కామ్ అనే ఒక తప్పుడు కథను సృష్టించారని

New Update
kavitha

ఢిల్లీ లిక్కర్ స్కామ్ సీబీఐ కేసులో మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(kavitha kalvakuntla) కు కోర్టులో ఊరట లభించడంపై బీఆర్ఎస్(BRS Party) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కేవలం కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికే ఈ లిక్కర్ స్కామ్(delhi-liqour-scam) అనే ఒక తప్పుడు కథను సృష్టించారని, దీని వల్ల రాజకీయంగా తమ పార్టీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో భారీగా నష్టపోయిందన్నారు కేటీఆర్. 

"నేడు కవిత గారికి న్యాయం జరిగింది. ఇదే విధంగా మా నాయకులపై పెట్టిన ప్రతి అక్రమ కేసు తప్పని త్వరలోనే బయటపడుతుంది" అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. నిజం తెలిసే వరకు కాంగ్రెస్, బీజేపీలు కలిసి మీడియా ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూనే ఉంటాయని ఆయన మండిపడ్డారు.

ఇవన్నీ కేవలం రాజకీయ కక్షతో, కావాలని సృష్టించిన ఆరోపణలేనని కేటీఆర్ విమర్శించారు. నేటి కొత్త భారతంలో ఆధారాలు చూపడం కంటే, ఆరోపణలు చేస్తూ మీడియాలో రచ్చ చేయడమే ఫ్యాషన్‌గా మారిందని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్ని కుట్రలు చేసినా చివరకు న్యాయమే గెలుస్తుందని కవితకు వచ్చిన క్లీన్ చీట్ నిరూపించిందని ఆయన స్పష్టం చేశారు.

Also Read :  లిక్కర్ కేసులో కవిత, కేజ్రీవాల్‌కు భారీ ఊరట.. క్లీన్‌చిట్ ఇచ్చిన కోర్టు

కవిత రియాక్షన్ ఇదే..  

సీబీఐ కేసులో తనకు క్లీన్ చీట్ రావడంపై కవిత స్పందించారు. తాను ఈ కేసు నుంచి కడిగిన ముత్యంలా బయటికి వస్తానని ప్రజలకు మొదట్నుంచి చెబుతున్నానని,  అలాగే వచ్చానన్నారు కవిత.  తనకు న్యాయవ్యవస్థ పైన ముందునుంచి నమ్మకం ఉందని ఈ రోజు అదే నిజమైందని వెల్లడించారు. 

ఇది కేవలం రాజకీయ కక్షతో పెట్టిన కేసు అని కవిత చెప్పుకొచ్చారు. తాను  ఎన్నోసార్లు ఇది చెప్పానని చివరకు అదే నిజమైందన్నారు. ఈ కేసు వలన తనతో పాటు తన కుటుంబం కొన్ని నెలలపాటు క్షోభ అనుభవించామని వెల్లడించారు. విపక్షాలను వేధించేందుకు దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నారని కవిత మండిపడ్డారు. 

కోర్టు తీర్పు రాకుండానే నాపై కొందరు అనుచితంగా మాట్లాడారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనకు కష్ట సమయంలో అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు కవిత.  కోర్టు తీర్పు వెలువడిన అనంతరం ఆమె తన ఎక్స్ వేదికగా సత్యమేవ జయతే అని పోస్ట్‌ చేశారు. కాగా దాదాపు 5 నెలల పాటు తీహార్ జైల్లో కవిత ఉన్నారు. 

ఢిల్లీ ఎక్సైజ్ స్కామ్‌లో సిబిఐ దాఖలు చేసిన కేసులో కవితతో పాటు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ (ఆప్) అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలను రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం నిర్దోషులుగా విడుదల చేసింది.

Also Read :  కలెక్టర్ ట్రాన్స్‌ఫర్‌.. సంబురాలు చేసుకున్న జనం.. ఎక్కడో తెలుసా?

Advertisment
తాజా కథనాలు