BRS కు కవిత గుడ్ బై? | Kavitha Resign To BRS | KCR | KTR | Telangana Politcs | RTV
చార్మినార్లో అగ్ని ప్రమాద బాధితులను మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. చనిపోయిన వారికి రూ.5 లక్షలు ఎక్స్గ్రేషియా సరిపోదని.. రాష్ట్ర ప్రభుత్వం కనీసం రూ.25 లక్షలు అయినా ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్రావుతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రెండోరొజు భేటీ అయ్యారు. హరీష్ రావు పార్టీ మారుతున్నారన్న ప్రచారం నేపథ్యంలో కేటీఆర్ ఆయనతో రెండోరోజు సమావేశమవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ రోజు హరీష్ రావు ఇంటికి సతీసమేతంగా వెళ్లిన కేటీఆర్ దాదాపు రెండు గంటలకు పైగా చర్చలు జరిపారు. ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే.. హరీష్ తండ్రి అనారోగ్యంతో చికిత్స పొందుతున్న నేపథ్యంలో పరామర్శించడానికే వెళ్లినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
బీఆర్ఎస్ పార్టీ 25వ వార్షికోత్సవ వేడుకలను అమెరికాలోని డల్లాస్ నగరంలో నిర్వహించనున్నారు. జూన్ 1న డల్లాస్లోని డీఆర్ పెప్పర్ అరేనాలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. ఈ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గాయపడ్దారు. జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా స్లిప్ డిస్క్ (వెన్ను పూసకు గాయం) అయింది. దీంతో గాయపడిన కేటీఆర్ వెంటనే డాక్టర్లను సంప్రదించారు. డాక్టర్లు కొన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకుని కోలుకోవాలని సలహా ఇచ్చారు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేటీఆర్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆదిలాబాద్ జిల్లా ఊట్నూర్ పోలీస్ స్టేషన్ లో ఆయనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను ఉన్నత న్యాయ స్థానం కొట్టివేసింది. రాజకీయ ప్రేరేపిత కేసుగా భావిస్తూ ఎఫ్ఐఆర్ను కొట్టివేసింది.