సిట్ విచారణకు తాను పూర్తిగా సహకరించానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఫోన్ టాపింగ్ కేసులో భాగంగా జూబ్లీహిల్స్ పీఎస్ లో జరిగిన సిట్ విచారణ అనంతరం కేటీఆర్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. బయటకు లేనిపోని ఎందుకు లీకులు ఇస్తున్నారని తాను సిట్ అధికారులను ప్రశ్నించానని అన్నారు, ఈ ప్రభుత్వం లీకు వీరుల ప్రభుత్వమని విమర్శించారు. హీరోయిన్ల పేరుతో దుష్ప్రచారం చేశారని, అది నిజమేనా అని సిట్‌ను అడిగా. తాము అలాంటి వార్తలు మీడియాకు చెప్పలేదని సిట్ అధికారులు చెప్పారని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
ప్రభాకర్ రావు, రాధా కిషన్ రావు అనే వారిని తీసుకొచ్చి తన ఎదురుగా కూర్చోబెట్టి నన్ను విచారించారని మీడియాలో లీకులు ఇచ్చారని, అక్కడ తారకరామారావు, పోలీసులు తప్ప ఏ రాధా కిషన్ రావు, ఇంకో రావు లేడన్నారు. ఇక ప్రతిపక్షంలో ఉన్న తమ ఫోన్లు, కూడా ట్యాప్ చేస్తున్నారు కదా అని సిట్ అధికారులను అడిగితే.. తమకు సంబంధం లేదు.. తెలియదు అని అంటున్నారు తప్ప తాము ట్యాప్ చెయ్యడం లేదు అని అనడం లేదని అంటున్నారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. మరోసారి విచారణకు పిలుస్తామంటే.. వస్తానని చెప్పానని కేటీఆర్ తెలిపారు.
7 గంటల పాటు విచారణ
జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో సుమారు7 గంటల పాటు ఆయనను సిట్ అధికారులు ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారాన్ని ఉపయోగించి పలువురు బిజినెస్ మెన్ లను బెదిరించి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో విరాళాలు సేకరించారా? అన్న కోణంలో విచారణ సాగినట్లుగా తెలుస్తోంది. కేటీఆర్ స్టేట్‌మెంట్‌ను సిట్ రికార్డ్ చేసింది. అవసరమైతే మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఈ కేసులో తదుపరి యాక్షన్ ప్లాన్‌పై సిట్ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
కాగా సిట్ నోటీసుల మేరకు కేటీఆర్ ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఆయన వెంట హరీష్ రావుతో పాటుగా ఇతర బీఆర్ఎస్ కీలక నేతలు వెళ్లారు. కేటీఆర్ రాక సందర్భంగా పోలీసులు జూబ్లీహిల్స్ పరిసరాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కార్యాలయం బయట బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన తెలపడంతో ఉద్రిక్తత నెలకొంది.
నేను తప్ప ఏ రావు లేడక్కడ.. KTR సంచలన విషయాలు!
సిట్ విచారణకు తాను పూర్తిగా సహకరించానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఫోన్ టాపింగ్ కేసులో భాగంగా జూబ్లీహిల్స్ పీఎస్ లో జరిగిన సిట్ విచారణ అనంతరం కేటీఆర్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు.
KTR