/rtv/media/media_files/2025/06/16/EMG4ml3aM6FFdfKB3kZe.jpg)
KTR
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సిట్ నోటీసులు పంపింది. రేపు (శుక్రవారం) ఉదయం 11గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లోని సిట్ ఆఫీస్‌లో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు పోలీసు అధికారులు అరెస్ట్ కాగా, ఇప్పుడు రాజకీయ నాయకుల విచారణ ప్రారంభం కావడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. కేటీఆర్‌కు మొదటిసారి ఈ కేసులో నోటీసులు అందాయి.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్‌కు సిట్ నోటీసులు
— Telugu Scribe (@TeluguScribe) January 22, 2026
రేపు ఉదయం 11గంటలకు విచారణకు రావాలని నోటీసులు
జూబ్లీహిల్స్ పీఎస్‌లో విచారించనున్న సిట్ అధికారులు pic.twitter.com/3OFUt88EQc
నందినగర్‌లోని కేటీఆర్ ఇంటికి సిట్ విచారణ అధికారలు గురువారం నోటీసులు పంపారు. 160 CRPC కింద నోటీసులు ఇచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇదే కేసులో రెండు రోజుల క్రితం హరీష్ రావుని సిట్ అధికారులు విచారించారు. హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ని సిట్ చీఫ్‌గా నియమించాక ఫోన్ టాపింగ్ కేసు విచారణ ఊపందుకుంది.
Follow Us