ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్.. పోలీసుల అదుపులో హరీశ్ రావు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని బంజారా హిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం ఆయన పోలీస్ స్టేషన్ ముందు హల్ చల్ చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని సీఐ రాఘవేంద్ర ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆయన పై కేసు నమోదు చేశారు.