Koushik Reddy : ఉత్తమ్ కుమార్ రెడ్డికి కౌశిక్ రెడ్డి పరామర్శ!

మంత్రి ఉత్తమ్ తండ్రి పురుషోత్తం రెడ్డి ఈ రోజు మరణించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఉత్తమ్ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. పురుషోత్తం రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించారు.

New Update
Uttam Kumar reddy Koushik Reddy

తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పరామర్శించారు. ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఉత్తమ్ నివాసానికి వెళ్లిన పాడి కౌశిక్ రెడ్డి పురుషోత్తం రెడ్డి భౌతిక కాయానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

ఇరు కుటుంబాల మధ్య బంధుత్వం

ఉత్తమ్ కుమార్ రెడ్డి, కౌశిక్ రెడ్డి మధ్య బంధుత్వం ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌశిక్ రెడ్డికి వరుసకు అన్నయ్య అవుతారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. పెదనాన్న పురుషోత్తం రెడ్డి మరణంతో తమ కుటుంబంలో తీవ్ర విషాదం నింపిందని.. ఆయన మృతి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డి వెంట రాజ్య సభ్యు సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు వీ ప్రకాశ్ తదితరులు ఉన్నారు. 

Also Read :  కుంటలో రేవంత్ ఇల్లు.. ముందు దాన్ని కూల్చుకో: బాంబు పేల్చిన హరీశ్ రావు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు