BREAKING: కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి!

TG: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈరోజు హుజురాబాద్‌లో దళిత బంధు నిధులు విడుదల చేయాలని ఆందోళనకు దిగారు. ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకొని కారు ఎక్కిస్తుండగా స్పృహ తప్పి పడిపోయారు. రేవంత్ తనను చంపేందుకు కుట్ర చేస్తున్నారన్నారు కౌశిక్.

New Update
KOUSHIK REDDY,

Koushik Reddy: హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. హుజురాబాద్‌లో దళిత బంధు డబ్బులు విడుదల చేయాలని ధర్నాకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. కౌశిక్ రెడ్డిని బలవంతంగా వాహనంలోకి ఎక్కిస్తుండగా.. తోపులాటలో సృహ తప్పి పడిపోయారు. ఊపిరాడక కంటతడి పెట్టుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన మీద హత్యాయత్నం చేయిస్తున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాణం పోయే వరకు తన దళిత బిడ్డల కోసం పోరాడుతానని.. దళిత బంధు ఎందుకు ఇవ్వరు అని అడిగితే ఈ విధంగా లాఠీ ఛార్జ్ చేస్తారా? అని సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు. కాగా ప్రస్తుతం హుజురాబాద్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Also Read :  దాతృత్వంలో శివ్ నాడార్ టాప్.. ఎన్ని కోట్లు విరాళమంటే?

Also Read :  నేరుగా ఓటీటీలోనే తమన్నా క్రైమ్ థ్రిల్లర్ విడుదల.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

హరీష్ రావు సీరియస్...

అంబేద్కర్ విగ్రహం సాక్షిగా, హుజురాబాద్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై జరిగిన పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం అని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. దళిత బంధు లబ్ధిదారులకు రెండో విడత ఆర్థిక సహాయం చెల్లించాలని కోరడమే కౌశిక్ రెడ్డి చేసినా తప్పా? అని నిలదీశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా? అని అన్నారు. ఇది ప్రజా పాలన కాదు, రేవంత్ మార్కు రాక్షస పాలన, కాంగ్రెస్ మార్కు నిరంకుశ పాలన, ఇందిరమ్మ ఎమర్జెన్సీ  నాటి నిర్బంధ పాలన అని ఫైర్ అయ్యారు. అస్వస్థతకు గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమ ఎమ్మెల్యే ఆరోగ్యం, భద్రత.. పట్ల పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని అన్నారు. అరెస్ట్ చేసిన బిఆర్ఎస్

 నాయకులను, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు.

Also Read :  అందరికీ దూరంగా ఒంటరిగా.. అరుదైన వ్యాధితో బాధపడుతున్న అర్జున్ కపూర్!

Also Read :  వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ అరెస్ట్?

Advertisment
Advertisment
తాజా కథనాలు