/rtv/media/media_files/2025/05/06/jTcJYib2tVTOv4KJReRJ.jpg)
Ukrainian man kills monkeys in Uttar Pradesh
Monkey died: యూపీలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. మధుర జిల్లా అన్యూర్ గ్రామంలో ఉక్రెయిన్ వాసుడు లోకల్ ఫ్రెండ్ తో కలిసి పదుల సంఖ్యలో కోతులను చంపేశారు. ఎయిర్‌గన్‌తో ఈ దారుణానికి పాల్పడగా 60 కోతులు చనిపోగా మరిన్ని గాయపడ్డాయి. ఈ సంఘటన గురించి స్థానికులు సమాచారం అందించగానే ఘటన స్థలానికి చేరుకున్న గోవర్ధన్ పోలీసులు.. స్థానిక పశువైద్యశాల బృందాన్ని పిలిపించారు. చనిపోయిన కోతులను పోస్ట్‌మార్టం కోసం పంపించి, గాయపడిన జంతువులకు చికిత్స చేశారు. ఈ జీవహింసపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా అసలు విషయం బయటపడింది.
దాదాపు 60 కోతులకు పైగా..
ఈ మేరకు రాధా మదన్ మోహన్ దాస్ ఆశ్రమంలో నివసిస్తున్న ఉక్రేనియన్ జాతీయుడు బ్రజ్ సుందర్ దాస్.. స్థానిక స్నేహితుడు జానకీ దాస్‌తో కలిసి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఉదయం 11 గంటల ప్రాంతంలో ఎయిర్ గన్ ఉపయోగించి కోతులను కాల్చాడు. గత నెలలో దాదాపు 60 కోతులు ఈ ప్రాంతంలోనే చనిపోయాయని గ్రామస్థులు తెలిపారు. గోవర్ధన్ వెటర్నరీ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ శ్వేతా సింగ్ మాట్లాడుతూ.. 'పోలీసులు ఈ కేసు గురించి మాకు సమాచారం అందించారు. సంఘటన స్థలంలో మేము గాయపడిన కోతులకు ప్రథమ చికిత్స అందించాం. ఎయిర్ గన్ వల్లే ఈ గాయాలయ్యాయి. ఇది బాధాకరం. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించాం' అని చెప్పారు.
Also Read: ఛీ ఛీ.. అక్కవేనా నువ్వు..? సొంత చెల్లెళ్లని లవర్‌తో రేప్ చేయిస్తావా..!
స్థానికుడు జానకీ దాస్, నిందితుడు బ్రజ్ సుందర్ దాస్ (ఉక్రేనియన్ జాతీయుడు) అదుపులోకి తీసుకున్నట్లు గోవర్ధన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) రవి త్యాగి తెలిపారు. నిందితులిద్దరిపై ఐపీసీ సెక్షన్ 325 (ప్రత్యక్షంగా తీవ్ర బాధ కలిగించడం), సెక్షన్ 351(3) (నేరపూరిత బెదిరింపు), జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం 1960లోని సెక్షన్ 11 కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
Also Read: హైదరాబాద్ లేడీసా మజాకా.. బ్లౌజ్ ఆఫర్ చూడగానే పరుగో పరుగు - కిక్కిరిసిపోయిన షాప్
uttarapradesh | killed | telugu-news | today telugu news