Khammam: ఖమ్మంలో దారుణం.. మనవడిని అమ్మేసిన నానమ్మ.!
ఖమ్మంలో దారుణం చోటుచేసుకుంది. నాగమణి అనే మహిళ సొంత మనవడిని రూ. 5 లక్షలకు అమ్మేసింది. విషయం గుర్తించిన ఆ బాబు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఖమ్మంలో దారుణం చోటుచేసుకుంది. నాగమణి అనే మహిళ సొంత మనవడిని రూ. 5 లక్షలకు అమ్మేసింది. విషయం గుర్తించిన ఆ బాబు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఖమ్మంలోని కాల్వ ఒడ్డులో విషాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఫోన్ మాట్లాడుతూ.. పొరపాటున వాటర్ హీటర్ ను చంకలో పెట్టుకున్నాడు. దీంతో షాక్ కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పెంపుడు కుక్కకు స్నానం చేయించడం కోసం వాటర్ హీటర్ తో నీటిని వేడిచేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు గంజాయి స్మగ్లర్ల ఆటకట్టించారు. చింతూరు నుంచి ట్రాక్టర్ అడుగు భాగంలో గంజాయి ప్యాకెట్లను అమర్చి.. పైన ఇసుకను కప్పి తరలిస్తుండగా భద్రాచలం గోదావరి వంతెన వద్ద పోలీసులు పట్టుకున్నారు. భారీ మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
ఖమ్మంలో ఫేక్ ఫుడ్ ఇన్ స్పెక్టర్లు అరెస్ట్ అయ్యారు. ఆహార తనిఖీ అధికారులమంటూ నగరంలోని కింగ్ దర్బార్ హోటల్లో ఆకస్మిక తనిఖీ చేసి హల్చల్ చేశారు. విచారణ నివేదిక అనుకూలంగా ఇవ్వాలంటే రూ. 2లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనుమానం వచ్చిన హోటల్ యజమాని వారిని అరెస్ట్ చేయించారు.
ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో ఆరేళ్ల బాలికపై మైనర్ బాలుడు మాలోతు వినోద్ లైంగికదాడికి పాల్పడ్డాడు. వీధిలో ఆడుకుంటున్న బాలికను బలవంతంగా ఇంట్లోకి ఎత్తుకెళ్లి ఈ అఘాయిత్యం చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి.కొండలరావు తెలిపారు.
ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనదారులకు NHAI గుడ్ న్యూస్ చెప్పింది. ఖమ్మం-సూర్యాపేట రోడ్డు హైదరాబాద్-విజయవాడ హైవేను కలిసే ప్రాంతంలో ఫ్లై ఓవర్ నిర్మించనున్నారు. దీంతో ఖమ్మం నుంచి వచ్చే వాహనదారులు యూటర్న్ కోసం 2 కి.మీ ప్రయాణించాల్సిన అవసరం ఉండదు.
ఖమ్మం జిల్లా గంగారంలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. బైక్పై వెళ్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్లపెంట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ప్రాధమిక పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్న తోలెమ్ వరుణ్(7) అనే బాలుడు సీతారామ కెనాల్లో పడి మృతి చెందాడు. ఉపాధ్యాయుడి నిర్లక్ష్యం కారణంగానే వరుణ్ మృతి చెందాడని కుటుంబ సభ్యులు ధర్నా చేపట్టారు.
ఖమ్మంలో టీచర్ శిరీషకు ఉపాధ్యాయ సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. ఆమెపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల విద్యార్థుల హెయిర్ కట్ సరిగా లేదంటూ ఉపాధ్యాయురాలు శిరీష కత్తెరతో జుట్టు కత్తిరించారు. దీంతో ఉన్నతాధికారులు ఆమెపై సస్పెన్షన్ వేటు వేశారు.