ర్యాగింగ్ కలకలం.. మెడికల్ విద్యార్థికి గుండు కొట్టించి, ఏం చేశారంటే! ఖమ్మం మెడికల్ కాలేజీలో ఓ విద్యార్థి డిఫరెంట్‌గా హెయిర్‌కట్ చేసుకున్నాడు. దీంతో హాస్టల్ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆ విద్యార్థిని సెలూన్‌కు తీసుకెళ్లి గుండు గీయించాడు. అలాగే నల్లగొండ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన జరిగింది. By Seetha Ram 17 Nov 2024 in తెలంగాణ క్రైం New Update షేర్ చేయండి మెడికల్ కాలేజీలో ఓ విద్యార్థి డిఫరెంట్‌గా హెయిర్ కట్ చేయించుకున్నాడు. అది తెలిసి అసిస్టెంట్ ప్రొఫెసర్ సెలూన్‌కు తీసుకెళ్లాడు. ఆపై ఆ విద్యార్థికి గుండు కొట్టించాడు. దీంతో మనస్థాపం చెందిన ఆ విద్యార్థి చేసిన పనికి అంతా షాక్ అయ్యారు. మరి ఆ విద్యార్థి ఏం చేశాడో అనే విషయానికొస్తే.. ఇది కూడా చూడండి: వైద్యుల నిర్లక్ష్యం.. ప్రైవేట్ ఆసుపత్రికి రూ.30 లక్షల జరిమానా! ములుగుకు చెందిన ఓ విద్యార్థి ఖమ్మంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఈ ఏడాది జాయిన్ అయ్యాడు. అతడు చాలా డిఫరెంట్‌గా హెయిర్ కట్ చేసుకోవడంతో.. సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థుల ర్యాగింగ్‌తో మరోసారి కటింగ్ చేయించుకున్నాడు. విద్యార్థికి గుండు కొట్టించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇక ఇదే విషయం బాయ్స్ హాస్టల్ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఆఫీసర్‌గా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు తెలిసింది. దీంతో కోపంతో రగిలిపోయి ఆయన.. ఆ విద్యార్థిని మళ్లీ సెలూన్‌కు తీసుకెళ్లి గుండు కొట్టించాడు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన ఆ విద్యార్థి కాలేజీ ప్రిన్సిపాల్ రాజేశ్వరరావుకు ఫిర్యాదు చేశాడు. ఇది కూడా చూడండి: ట్రంప్ మరో విచిత్ర నిర్ణయం.. వ్యాక్సిన్లు వద్దన్న వ్యక్తికి హెల్త్ మినిస్ట్రీ! వెంటనే స్పందించిన ప్రిన్సిపాల్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను బాయ్స్ హాస్టల్ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఆఫీసర్ విధుల నుంచి తొలగించారు. ఇదే విషయమై ప్రిన్సిపాల్‌ను వివరణ కోరగా.. ఈ ఘటనను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. అంతేకాకుండా విచారణకు ఫోర్‌మెన్ కమిటీని నియమించామని పేర్కొన్నారు. ఇది కూడా చూడండి: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. ప్రత్యేకంగా 26 రైళ్లు ఏర్పాటు నల్లగొండ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఇది మాత్రమే కాకుండా మరో ఘటన నల్లగొండలో జరిగింది. నల్లగొండ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ముగ్గురు సీనియర్ విద్యార్థులను, అలాగే ఒక జూనియర్ డాక్టర్‌ను సస్పెండ్ చేశారు. కాలేజీలో జూనియర్ విద్యార్ధినులను ర్యాగింగ్ చేశారనే ఆరోపణలతో వీరిని సస్పెండ్ చేశారు. జూనియర్ విద్యార్థినులను ర్యాగింగ్ పేరుతో ఇబ్బందులు పెడుతున్నారనే ఫిర్యాదుతో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థికి నెల రోజులు, అలాగే నాలుగో సంవత్సరం చదువుతున్న ఇద్దరికి ఆరు నెలలు, ఒక జూ. డాక్టర్‌కు మూడు నెలల పాటు సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. ఇది కూడా చూడండి: ఉన్నత హోదా ఇప్పిస్తామని.. హీరోయిన్ తండ్రికి రూ.25 లక్షలు టోకరా #khammam #government-medical-college #ragging-incident మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి