Wayanad landslides: వయనాడ్ అతలాకుతలం.. భారీగా పెరుగుతున్న మృతుల సంఖ్య!
కేరళలోని వయనాడ్ జిల్లా ప్రకృతి విపత్తులతో అతలాకుతలమైంది. భారీ వర్షం కారణంగా వాయనాడ్ కొండచరియలు విరిగిపడటంతో 108 మంది మరణించారు. కొంతమంది గల్లంతయ్యారు. కేరళ పినరయి విజయన్ జూలై 30, 31వ తేదీలను రాష్ట్రవ్యాప్త సంతాప దినాలను ప్రకటించారు.