/rtv/media/media_files/2024/10/20/4RJCIriK1mZYdnNkyr6t.jpg)
మైనర్ బాలికపై అత్యాచారం కేసులో కేరళ కోర్టు సంచలన తీర్పును తెలిపింది. వివరాల్లోకి వెళ్తే తమిళనాడుకి చెందిన ఓ కుటుంబం కేరళలో నివసిస్తుంది. మైనర్ బాలిక అయిన కూతురిపై సవతి తండ్రి గత కొన్నేళ్ల నుంచి అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ విషయాన్ని తల్లికి చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చూడండి: Fengal Cyclone : తీరాన్ని తాకిన తుపాను..జిల్లాలకు అధికారుల హెచ్చరికలు
దోషిగా తేలడంతో..
ఈ కేసులో ఆ సవతి తండ్రిని దోషిగా నిర్థారించి 141 ఏళ్లు జైలు శిక్ష విధిస్తున్నట్లు కేరళ కోర్టు తీర్పునిచ్చింది. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం ప్రకారం మంజేరి ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్ జడ్జి అష్రఫ్ అతని ఈ జైలు శిక్షతో పాటు రూ.7.85 లక్షలు జరిమానా విధించింది. బంధాలు, వయస్సుతో తేడా లేకుండా కొందరు దుండగులు ఇలాంటి దారుణలకు పాల్పడుతున్నారు.
ఇది కూడా చూడండి: BIG BREAKING: తెలంగాణలో ఆ ఉద్యోగ నోటిఫికేషన్ రద్దు..
ఇదిలా ఉండగా.. ఇటీవల హైదరాబాద్‌లో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినికి చదువు చెప్పడం మానేసి ప్రేమ పాఠాలు నేర్పించాడు. ఆమెతో తప్పుగా ప్రవర్తించాడు. అయితే ఈ విషయాన్ని ఆ స్టూడెంట్ తన తల్లిదండ్రులకు చెప్పింది. వారు కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా.. ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం ఈ సంఘటన హాట్ టాపిక్‌గా మారింది.
ఇది కూడా చూడండి: Adani: దాడులు మరింత బలాన్ని ఇస్తాయి..గౌతమ్ అదానీ
మియాపూర్‌లోని మదీనగూడ శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో ఓ విద్యార్థినికి ప్రేమ వేధింపులు వచ్చాయి. ఆ కాలేజీ కెమిస్ట్రీ లెక్చరర్ హరీష్ విద్యార్థినితో తప్పుగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని ఆ స్టూడెంట్ తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. కానీ కాలేజీ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో విద్యార్థిని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు కాలేజీ వద్ద ఆందోళన చేపట్టారు.
ఇది కూడా చూడండి: ఇండియాలో బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్ ఇవే..?