Karnataka: షాకింగ్ న్యూస్.. ఆలయంలో భారీ తొక్కిసలాట.. వేల సంఖ్యలో...!

కర్ణాటకలోని చిక్‌మంగుళూరులో మాణిక్య ధార కొండపై ఉన్న దేవిరమ్మ జాతరకు వేలాది మందికి పైగా భక్తులు పోటెత్తారు. దీంతో తొక్కిసలాట జరిగి వందలమందికి పైగా కొండ మీద నుంచి జారి పడ్డారు. క్షతగాత్రులను పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.

author-image
By Kusuma
New Update
Foto

Karnataka: కర్ణాటకలోని చిక్‌మంగుళూరులో విషాధ ఘటన చోటుచేసుకుంది. మాణిక్య ధార కొండపై ఉన్న దేవిరమ్మ జాతరకు వేలాది మందికి పైగా భక్తులు పోటెత్తారు. ఎత్తులో ఉండే అమ్మవారిని దర్శించుకోవాలంటే కిలోమీటర్ల కొండను ఎక్కాల్సిందే. చలికాలం కావడంతో అమ్మవారి కొండను పొగమంచు పూర్తిగా కమ్మేసింది. 

ఇది కూడా చూడండి: ఐపీఎల్ 2025 రిటెన్షన్.. అత్యంత ఖరీదైన ఆటగాళ్లు వీళ్లే!

భక్తులు భారీగా రావడంతో ఒక్కసారిగా..

భక్తులు కూడా పరిమితికి మించి భారీగా రావడంతో.. తొక్కిసలాట జరిగింది. దీంతో కొండపై నుంచి వందలమందికి పైగా కిందకి జారిపడ్డారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని భక్తులను రక్షిస్తారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. 

ఇది కూడా చూడండి: స్పెయిన్‌లో వరద విలయ తాండవం.. కుప్పకుప్పలుగా మృతదేహాలు!

చిక్‌మంగళూరులో కొండమీద కొలువై ఉన్న బిండిగ దేవీరమ్మ నరక చతుర్ధశి నాడు భక్తులకు దర్శనమిస్తుంది. అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాది మందికి పైగా భక్తులు కొండ మీదకు పోటెత్తారు. రాళ్లు, ముళ్లు ఉన్న దారిలోనే చెప్పులు లేకుండా భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్లారు. అయితే సముద్ర మట్టానికి 3000 ఎత్తులో ఉండే ఈ కొండపై రాత్రికి భక్త జనం అధికమయ్యారు. 

ఇది కూడా చూడండి: సినిమా లెవల్‌లో గంజాయి అక్రమ రవాణా.. స్వాధీనం చేసుకున్న పోలీసులు

భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో పాటు వర్షం కూడా పడటంతో కొండపై నడవడానికి కష్టమైంది. దీంతో భక్తులు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని దిగడంతో వర్షానికి జారిపడి తొక్కిసలాట జరిగింది. వేలాది మందికి పైగా తొక్కిసలాట జరగడంతో కొందరు కొండ మీద నుంచి కిందకి పడిపోయారు. కొందరి కాళ్లు, చేతులు కూడా విరిగిపోయాయి. 

ఇది కూడా చూడండి: దాడికి సిద్ధమవుతున్న ఇరాన్.. ఈసారి మూడో ప్రపంచ యుద్ధమే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు