/rtv/media/media_files/2025/07/29/karnataka-six-month-old-baby-dwita-mohan-sets-world-record-2025-07-29-09-37-54.jpg)
Karnataka Six month old baby Dwita Mohan sets world record
ఆ చిన్నారి పేరు ద్వితా మోహన్. కేవలం ఆరే నెలలు. కర్ణాటకకు చెందిన ఈ చిన్నారి ఎవరూ చేయలేని అరుదైన ఘనత సాధించింది. అవునండీ మీరు విన్నది నిజమే. నడవడమే రాని ఆ చిన్నారి ఎక్కువ సేపు కూర్చుని అందరినీ ఆశ్చర్యపరచింది. కూర్చుంటే రికార్డు సాధించడమేంటి? అని అనుకుంటున్నారా?
ఆరు నెలల చిన్నారి రికార్డు
సాధారణంగా మనం ఒక ప్లేస్‌లో ఎంత సేపు కూర్చోగలం.. మహా అయితే 5 లేదా 10 నిమిషాలు కూర్చోగలం. కానీ ఇక్కడ ఆ చిన్నారి ముద్దుగుమ్మ ఏకంగా 44 నిమిషాల 8 సెకన్ల పాటు కూర్చుంది. అది కూడా ఎవరి సాయం లేకుండా.. ఇటు అటు కదలకుండా ఒకే ప్లేస్‌లో కూర్చొని అరుదైన రికార్డు సాధించింది.
కర్ణాటక రాష్ట్రం కంప్లికి చెందిన ఈ చిన్నారి ఒక లాయర్ మోహన్‌కుమార్ దానప్ప, సౌమ్యశ్రీ దంపతుల రెండో కుమార్తె. ఈమె జూన్ 28న 44 నిమిషాల 8 సెకన్ల సమయం పాటు కూర్చొని వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.