ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వినియోగం ఎంతలా పెరిగిందో పెద్దగా చెప్పనవసరం లేదు. ప్రపంచం నలు మూలల నుంచి ఏం జరిగినా ఇట్టే కనిపించేస్తోంది. చిన్నా, పెద్ద.. ముసలి, ముతక అంతా సోషల్ మీడియాలోనే రోజులు గడిపేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోలతో ఎంజాయ్ చేస్తున్నారు.
ALSO READ: ఘోరం.. వంతెనను ఢీకొట్టిన బస్సు.. 8 మంది ప్రయాణికులు మృతి!
చాలా వీడియో క్షణంలో వైరల్ అయితే.. మరికొన్ని వీడియోలకు కాస్త టైం పడుతుంది. ఇక నెటిజన్లు సైతం వీడియోలు చేస్తూ సెలబ్రిటీలు అయిపోతున్నారు. తరచూ వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి బాగా పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. అయితే కొన్ని వీడియోలు చూస్తే మాత్రం అవునా.. నిజమా అన్నట్లు ఉంటాయి.
ALSO READ:: ట్రయాంగిల్ సూసైడ్‌లో బిగ్ ట్విస్ట్.. వివాహేతర సంబంధమే!
ఆ వీడియోలు చూడ్డానికి చాలా విచిత్రంగానూ.. నమ్మలేనివిగానూ ఉంటాయి. అలాగే మరి కొన్ని సంఘటనలు సైతం నవ్వులు పూయిస్తాయి. తాజాగా అలాంటిదే ఒక సంఘటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు అది చూసి నెటిజన్లు నవ్వి నవ్వి కడుపు నొప్పి తెచ్చుకుంటున్నారు. ఒక గుడిలోని హుండీలో వచ్చిన 20 రూపాయల నోటు మీద ఉన్న రాత చూసి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. ఎందుకు అంతలా నవ్వుకుంటున్నారో? ఆ నోటు పైన ఏం రాసుంది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ALSO READ: అరంగేట్రంలోనే ప్రపంచ రికార్డ్.. క్రికెట్ చరిత్రలో ఏకైక మొనగాడు
వింత కోరిక
కర్ణాటకలోని కలబురగి జిల్లా అఫ్జలపుర తాలూకా ఘత్తరగి గ్రామంలో భాగ్యవంతి దేవి ఆలయం ఉంది. ఆ ఆలయం హుండీలో డబ్బును ఆలయ సిబ్బంది లెక్కపెడుతున్నారు. అదే క్రమంలో రూ.20 నోటు కనిపించింది. అది చూసి వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ‘మా అత్త త్వరగా చనిపోవాలి’ అని రాసి ఉన్న ఆ రూ.20 నోటు చూసి కడుపుబ్బా నవ్వుకున్నారు. దీంతో వారిలో ఒక చర్చ మొదలైంది. అత్త చావును కోరుకున్న వ్యక్తి అల్లుడా, లేక కోడలా అని మాట్లాడుకున్నారు. ఆ సంఘటన బయటకు రావడంతో నెట్టింట వైరల్ అయింది.
ALSO READ: చైనా బిగ్ ప్లాన్.. బ్రహ్మపుత్ర నదిపై భారీ డ్యామ్‌కు ఏర్పాట్లు