TS News: పెళ్లిలో చిచ్చు పెట్టిన మటన్ ముక్క..పొట్టు పొట్టు కొట్టుకున్న బంధువులు..!
వివాహ వేడుకలో మటన్ ముక్క చిచ్చు పెట్టింది. మటన్ కోసం రెండు వర్గాలు పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ఈ ఘటనలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. 16మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటన జగిత్యాల జిల్లా ఆత్మకూరులో జరిగింది.