Akbaruddin Owaisi:తెలంగాణలో గత వారం రోజులుగా జోరుగా సాగిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. కాగా ఎన్నికల ప్రచారం చివరిరోజున కరీంనగర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎంఐఎం నేత అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎంల దగ్గరకు తాము వెళ్లమని, వాళ్లే తమ వద్దకు వస్తారని హాట్ కామెంట్స్ చేశారు. ‘‘రెడ్డి అయినా.. రావు అయినా మా దగ్గరికి రావాల్సిందే అన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో మా మద్దతు లేనిదే కాంగ్రెస్ గెలిచిందా? అని అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు.తాము మద్దతు ఇవ్వకపోతే పరిస్థితి ఏంటో కాంగ్రెస్ పెద్దలకు కూడా తెలుసని అన్నారు.ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం బ్రదర్స్ సత్తా ఏంటో చూపిస్తాం’’ అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రులుగా ఎవరు వచ్చినా ఒవైసీ సోదరుల వద్దకు ఎందుకు వస్తారో ఒక్కసారి ఆలోచించాలని ప్రజలను కోరారు. అధికారంలో ఎవరు ఉన్నా, వారు ఏ పార్టీ వారైనా సరే తమ వద్దకు రావాల్సిందేనని, అది కేవలం ప్రజల బలమేనని అక్బరుద్దీన్ అన్నారు.కాగా ఆయన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఎవరి వల్లో మేము గెలవలేదు.. అక్బరుద్దీన్‌కు శ్రీధర్‌బాబు కౌంటర్
కాగా జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ఎంఐఎం మద్దతుతోనే కాంగ్రెస్ విజయం సాధించిందని.. తాము మద్దతు ఇవ్వకపోతే పరిస్థితి ఏంటో కాంగ్రెస్ పెద్దలకు కూడా తెలుసని ఆ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఎవరి వల్లో మేము గెలవలేదు.. కాంగ్రెస్ బలంతోనే గెలిచామని స్పష్టం చేశారు. మా పార్టీ నేతలు రేయింబవళ్లు కష్టపడితేనే విజయం సాధ్యమైందని చెప్పుకొచ్చారు. మా పాలనను చూసి ప్రజలు గెలిపించారు.. తామే గెలిపించామని అనుకుంటే పొరపాటే అని అక్బరుద్దీన్‌కు మంత్రి శ్రీధర్‌బాబు కౌంటర్ ఇచ్చారు.
Akbaruddin Owaisi: సీఎంల వద్దకు మేం వెళ్లం.. వాళ్లే మా దగ్గరికి వస్తారు: అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
కరీంనగర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎంఐఎం నేత అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎంల దగ్గరకు తాము వెళ్లమని, వాళ్లే తమ వద్దకు వస్తారని హాట్ కామెంట్స్ చేశారు. ‘రెడ్డి అయినా.. రావు అయినా మా దగ్గరికి రావాల్సిందే అన్నారు.
Akbaruddin