EWS reservations : ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై దుష్ప్రచారాన్ని ఆపండి :  పోలాడి రామారావు.

రాజకీయ రిజర్వేషన్లు లేని కారణంగా ఓసీలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ లో నిర్వహించిన ఓసీ జేఏసీ ఉమ్మడి జిల్లాస్థాయి విస్తృత సమావేశంలో పోలాడి రామారావు మాట్లాడారు.

New Update
FotoJet - 2026-01-20T203030.148

EWS reservations

EWS reservations : రాజకీయ రిజర్వేషన్లు లేని కారణంగా ఓసీలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ఆవేదన వ్యక్తం చేశారు.మంగళ వారం ఓసీ ఐకాస రాష్ట్ర ఉమ్మడి జిల్లాల నాయకుల ఆధ్వర్యంలో కరీంనగర్ హోటల్ శ్రీనివాస్ కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహించిన ఓసీ జేఏసీ ఉమ్మడి జిల్లా స్థాయి విస్తృత సమావేశంలో పోలాడి రామారావు మాట్లాడుతూ ఇటీవలి సర్పంచ్ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో సైతం ఎదుటివారి ఆర్థిక, అంగ బలం ముందు ఓసీ అభ్యర్ధులు సరితూగ లేక జనరల్ స్థానాల్లో కనీసం 50శాతం సీట్లు కూడా గెలుచుకోలేక పోయారని  విచారం వ్యక్తం చేశారు. ఓటుబ్యాంకు రాజకీయాలతో ఓసీలకు నేటికీ తీవ్ర అన్యాయం జరుగుతున్నదని అన్నారు. తాము ఏ వర్గాలకు వ్యతిరేకం కాదని, అన్ని వర్గాల ప్రజలకు అన్ని రంగాల్లో సమన్యాయం జరగాలన్నదే ఓసీ జేఏసీ ధ్యేయమని పేర్కొన్నారు.స్ధానిక ఎన్నికల్లో ఓసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు

ఈడబ్ల్యూఎస్ పై కుట్రలు సాగనివ్వం...

రాజ్యాంగ బద్దంగా ఏర్పాటైన 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై జరుగుతున్న అసత్య ప్రచారాలు, కొందరు తమ లబ్దికోసం చేస్తున్న కుట్రలను సాగానివ్వబోమని రామరావు స్పష్టం చేశారు. దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపు నిచ్చారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పటిష్ట అమలుకు ప్రత్యేక జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలని పోలాడి రామారావు  డిమాండ్ చేశారు. రాజ్యాంగ బద్దంగా ఏర్పడ్డ 10 శాతం ఈడబ్లూఎస్ రిజర్వేషన్లపై కొందరు ఆయా కులాల్లోని ప్రజలను మభ్య పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.స్వార్థ రాజకీయ ప్రయోజనాలు, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఓసీ లను పలుచన చేయాలనే కుయుక్తులను సాగనివ్వబోమని  విరుచుకుపడ్డారు. ఓసీ ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు విద్యా, ఉద్యోగ, పోటీ పరీక్షలలో వయోపరిమితిని పెంచాలని , ఈడబ్ల్యూఎస్ వారికి కేటాయించగా మిగిలిన బ్యాక్ లాగ్ పోస్టులను ఆ వర్గాల వారితోనే వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ జారీకి 10లక్షల ఆదాయ పరిమితి పెంచాలని డిమాండ్‌ చేశారు.

ఫిబ్రవరి 27 న ఢిల్లీ జంతర్ మంతర్ లో మహాధర్నా

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను ఓసీలలోని నిరుపేదలకు వర్తింప చేయాలని ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు కోరారు. ఈ డిమాండ్ల సాధనకు ఫిబ్రవరి 27 న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన జాతీయ స్థాయి ఓసీల మహా ధర్నాకు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలకతీతంగా ఓసీ సామాజిక వర్గీయులు తరలి వచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా మహా ధర్నాకు సంబందించి గోడ ప్రతులను కర పత్రాలను నాయకులు ఆవిష్కరించారు.  ఈ సమావేశంలో  ఓసీ జేఏసీ జాతీయ సలహాదారు పెండ్యాల కేశవ రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఐకాస అధ్యక్షుడు జున్నూతుల రాజిరెడ్డి ,ఓసీ ఐకాస రాష్ట్ర ఉమ్మడి జిల్లా నాయకులు అండెం రమణా రెడ్డి, మాదాటి శ్రీనివాస్ రెడ్డి, చిటుకుల రాజు, గడ్డం తిరుపతి రెడ్డి, చెన్నాడి మైపాల్ రెడ్డి, డెవరాజుల మనోహర్ శర్మ, ఆవోపా నమశ్శివాయ, తణుకు ప్రభాకర్, దడిగల వెంకటేష్ వర్ రావు, కంకణాల వీరారెడ్డి, వెన్నమ విక్రమ నరసింహా రావు చింతపల్లి రవీందర్ రావు, పీచర మనోహర్ రావు , ఉపేందర్, విష్ణు దాస్ గోపాల్ రావు, మిర్యాల ప్రసాద్ రావు, తదితరుల తో పాటు ఓసీ ఐకాస రాష్ట్ర ఉమ్మడి జిల్లా నాయకులు పాల్గొన్నారు.

Advertisment
తాజా కథనాలు