Srisailam project : శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ఉధృతి
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుంది. ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ప్రవాహంతో మరోసారి గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలానికి 1,03,587 క్యూసెక్కుల వరద ప్రవాహం చేరుకుంటోంది.